ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఓపెన్‌ డోర్‌" విధానానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్​.. - Andhra Pradesh Latest News

NTR District Collector: ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్​ ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం స్పందనలో అర్జీలు స్వీకరించే తరహాలోనే.. ఇతర రోజుల్లో కూడా ప్రజలు తమ వినతులు, సమస్యలు తెలుపుకునేందుకు ఓపెన్‌డోర్‌ విధానం తీసుకొచ్చారు.

NTR District Collector
ఓపెన్‌డోర్‌ విధానానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్​

By

Published : Jan 11, 2023, 12:53 PM IST

NTR District Collector Delhi Rao: ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు తన క్యాంపు కార్యాలయంలో ఓపెన్‌ డోర్‌ విధానానికి శ్రీకారం చుట్టారు. ఉద్యోగులు, సామాన్యులు, ఇతరులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా కలెక్టరును కలిసే అవకాశం కల్పిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం స్పందనలో అర్జీలు స్వీకరించే తరహాలోనే ఇతర రోజుల్లో కూడా వివిధ అంశాలపై తమ వినతులు ఇచ్చేందుకు, సమస్యలు తెలియజేసుకునేందుకు వచ్చే వారి కోసం తన క్యాంపు కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారు.

ఓపెన్‌ డోర్‌ విధానం ద్వారా ఇప్పటివరకు అమలులో ఉన్న ముందస్తుగా స్లిప్పులపై వివరాలు రాయడం, విజిటింగ్‌ కార్డులు పంపించడం వంటి పద్ధతులకు స్వస్తి పలికారు. రాష్ట్ర లేదా జిల్లా స్థాయి సమావేశాలు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మినహా ఇతర వేళల్లో తాను అందుబాటులోనే ఉంటానని ఢిల్లీరావు తెలిపారు. నేరుగా కలెక్టరు వద్ద సమస్యలు ప్రస్తావించాలనుకునే వారిని నిరాశ పరచకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు చెప్పారు..

''స్టేటస్​ పరిగేకొద్ది అధికారులను కలవడం కుదరదు అని ప్రజలు అనుకుంటారు. అలాంటిదేమీ ఉండకూడదు... సోమవారం మాత్రమే కాదు ఇతర రోజుల్లో కూడా తమ వినతులు, సమస్యలు, బాధలు గురించి చెప్పొచ్చు. 10 గంటల నుంచి 8గంటల వరకు ఉద్యోగులు, సామాన్యులు, ఇతరులు ఎవరైనా నేరుగా వచ్చి కలవచ్చు."-ఎస్‌.ఢిల్లీరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్​

ఓపెన్‌డోర్‌ విధానానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details