NTR Centenary Celebrations : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న రైతులతో ఆమె మాట్లాడారు. ఐదు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. సంప్రదాయంగా వస్తున్న ఎద్దుల పోటీలను నిర్వహించటం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
నందిగామలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఎద్దుల బండ లాగుడు పోటీలు - టీడీపీ వార్తలు
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఎన్టీఆర్ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను టీడీపీ నిర్వహిస్తుండగా.. ఉత్సవాల్లో భాగంగా అనాదీగా వస్తున్న ఒంగోలు జాతి బండ లాగుడు పోటీలను ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు