NTR CENTENARY CELEBRATIONS : చెన్నైలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. తమిళనాడులో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, ఆస్కా మాజీ అధ్యక్షుడు మాదాల ఆదిశేషయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో కళాకారులకు ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ పురస్కారాలను ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో గీత రచయిత భువనచంద్ర, నర్తకి జయమాలిని, అలనాటి నటి రాజశ్రీ ఉన్నారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరించిన వక్తలు...ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చైన్నైలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. పాల్గొన్న పలువురు నటులు - మాజీ ఆస్కా అధ్యక్షుడు మాదాల ఆదిశేషయ్య
NTR CENTENARY CELEBRATIONS IN CHENNAI : ఆంధ్రులకు అన్న, తెలుగు జాతి తారకరాముడు, వెండితెర వేల్పు, నందమూరి నాయకుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళనాడులో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, మాజీ ఆస్కా అధ్యక్షుడు మాదాల ఆదిశేషయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో కళాకారులకు ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు.
NTR CENTENARY CELEBRATIONS