ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిస్థితి మెరుగ్గా ఉంది.. తారకరత్నకు మీ అందరి ఆశీస్సులు కావాలి' - ఎన్టీఆర్ మీడియా సమావేశం

Nandamuri Taraka Ratna : నిన్నటికంటే ఈరోజు తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని బాలకృష్ణ వెల్లడించారు. బెంగళూరు లోని నారాయణ హృదయాలయ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తారకరత్నను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వసుంధర, బ్రాహ్మణి చూశారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్​ ఆసుపత్రికి వచ్చి తారకరత్నకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.

balakrishna jr ntr kalyanram
balakrishna jr ntr kalyanram

By

Published : Jan 29, 2023, 10:17 AM IST

Updated : Jan 29, 2023, 6:02 PM IST

Nandamuri Taraka Ratna : యువగళం పాదయాత్రలో శుక్రవారం అస్వస్థతకు గురైన తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. శనివారం వేకువజామున కుప్పం నుంచి బెంగుళూరుకు తీసుకువచ్చి ప్రత్యేక వైద్య బృందంతో అత్యున్నత చికిత్సను అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు ఈరోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా బ్రాహ్మణి, వసుంధర, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్​తో పాటు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆసుపత్రికి వచ్చారు.

శివకుమార్​తో కలసి మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ నిన్నటికంటే ఈ రోజు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. తారకరత్న ఆరోగ్యం క్షీణించిన పరిస్థితుల్లో అద్భుతం జరిగిందని చెప్పారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని.. వైద్య సేవలకు తారకరత్న స్పందిస్తున్నారని వివరించారు. దేవుడి కృపతో, అభిమానుల ప్రార్ధనతో తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు.

బెంగుళూరుకు.. కుటుంబ సమేతంగా నందమూరి కుటుంబ సభ్యులు

నిన్నటి కన్నా ఈ రోజు తారకరత్న ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉంది. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలి. బాలకృష్ణ

జూనియర్​ ఎన్టీఆర్​ స్పందన : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని జూనియర్ ఎన్టీఆర్‌ తెలిపారు. మెరుగైన వైద్యం అందుతోందని.. వైద్యానికి స్పందిస్తున్నారని ఎన్టీఆర్​ అన్నారు. తారకరత్న పోరాడుతున్నారని.. ఆత్మబలంతోపాటు అభిమానుల బలం ఉందని పేర్కొన్నారు. ఎంతోమంది ఆశీర్వాదం తారకరత్నకు ఉందని అంతేకాకుండా.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్‌ ఎంతో సహకరించారని వెల్లడించారు.

‘తారకరత్న పోరాడుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉంది. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నా వైద్యానికి సహకరిస్తున్నారు. నేను ఐసీయూలోకి వెళ్లి పలకరించే ప్రయత్నం చేశాను.. కొంత స్పందన కనిపించింది. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒక కుటుంబసభ్యుడిగా వారు నాకు ధైర్యం చెప్పారు. అభిమానులు, అందరి ప్రార్థనలతో తారకరత్న ఆరోగ్యంగా బయటకు వస్తారని ఆశిస్తున్నాం. తాతగారి ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఆయనకు బలంగా ఉన్నాయి. అభిమానుల ప్రత్యేక పూజలతో తారకరత్న పూర్వస్థితికి వస్తారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వం తరఫున రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ ఎంతో సహకరించారు’- జూనియర్​ ఎన్టీఆర్​

కర్ణాటక వైద్య శాఖ మంత్రి :తారకరత్నకు చికిత్స అందించేందుకు కర్ణాటక సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మంత్రి సుధాకర్ తెలిపారు. కుప్పం నుంచి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. నిమ్హాన్స్ నుంచి నిపుణులను రప్పించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారని మంత్రి అన్నారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వివరించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 29, 2023, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details