DECCAN QUEEN BUS: విభజన సమయంలో రాష్ట్రానికి వాటాగా వచ్చిన నిజాం కాలం నాటి డెక్కన్ క్వీన్ బస్సును ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ బస్టాండ్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా మెరుగులు దిద్ది ప్రదర్శన కోసం ఉంచారు. ఈ బస్సుని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం విశిష్టమైన సేవలను అందించి లాభాలను అర్జించింది అన్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల కోసం మరిన్ని సేవలను ఆర్టీసీ అందిస్తుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం నిజాం కాలం నాటి బస్సులు రెండింటిలో ఒకటి మన రాష్ట్రానికి వచ్చిందని, దాన్ని ప్రయాణికుల ప్రదర్శన కోసం ఉంచామన్నారు. ప్రయాణికులు సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా బస్సు వద్ద పాయింట్ ఏర్పాటు చేస్తామన్నారు.
నిజాం కాలం నాటి డెక్కన్ క్వీన్ బస్సుకు నూతన హంగులు - Inauguration of Nizam era Deccan Queen bus
DECCAN QUEEN BUS: విభజన సమయంలో రాష్ట్రానికి వాటాగా వచ్చిన నిజాం కాలం నాటి డెక్కన్ క్వీన్ బస్సును ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ బస్టాండ్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా మెరుగులు దిద్ది ప్రదర్శన కోసం ఉంచారు. ఈ బస్సుని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు.
DECCAN QUEEN BUS INAUGURATION