New Year celebrations at Raj Bhavan: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్లో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్ దంపతులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ కుటుంబ సమేతంగా విచ్చేసి గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్ధానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం పండితులు మంత్రోచ్ఛరణతో గవర్నర్ దంపతులను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటం, అందించారు. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బిసి సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జున రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కిషోర్, ఎన్టిఆర్ జిల్లా జేసి నుపూర్ అజయ్ కుమార్, విఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్లు గవర్నర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్ భవన్లో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు... - AP Highlights
New Year celebrations at Raj Bhavan: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. గవర్నర్ దంపతులకు పలువురు ప్రజాప్రతినిధులకు, అధికారులు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపి.. ఆశీస్సులు తీసుకున్నారు.
రాజ్ భవన్లో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు