Pradesh Congress Committee: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు కలసి రాష్ట్ర నూతన కమిటీని నియమించినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా రుద్రరాజు ఉంటారని, వర్కింగ్ ప్రెసిడెంట్, మీడియా చైర్మన్, కమిటీ చైర్మన్, ఇతర నాయకులకు బాధ్యతలు కేటాయించామని మస్తాన్వలి తెలిపారు. నూతన కమిటీ ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 1గంటకు భవానీపురంలో ఉన్న ఎన్ కన్వెన్షన్లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ దోపిడీ విధానంలో మిత్రులకి పరోక్షంగా సహాయం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంతో పాటుగా.. రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.