ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Negligence on VMC New Building Construction: చంద్రబాబు ప్రారంభించారని జగన్ సర్కారు వివక్ష.. పిల్లర్ల దశలోనే వీఎంసీ భవనం - Vijayawada Municipal Corporation building

Negligence on VMC New Building Construction: విజయవాడ నగర పాలక సంస్థ అవసరాలకు ప్రస్తుతం ఉన్న భవనం సరిపోకపోవడంతో నూతన భవనం నిర్మాణానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2015లో నిర్మాణం ప్రారంభం కాగా.. నాలుగు అంతస్తుల మేర పనులు జరిగాయి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం.. భవన నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా గత ప్రభుత్వం ఈ నిర్మాణం చేపట్టినప్పటికీ.. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో ఉద్యోగులు విధులు నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Negligence on VMC New Building Construction
Negligence on VMC New Building Construction

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 1:47 PM IST

Updated : Oct 9, 2023, 7:46 PM IST

Negligence on VMC New Building Construction: విజయవాడ నగరపాలక సంస్థ (Vijayawada Municipal Corporation) నూతన పరిపాలన భవనం పనులు ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. సుమారు 30 కోట్ల రూపాయలతో అంచనాలతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భవనం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. పార్కింగ్ స్థలంతో పాటు నాలుగు అంతస్థుల వరకు పిల్లర్లు నిర్మించింది. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా నేటికీ నూతన పరిపాలన భవనం పనులు పూర్తి చేయలేదు. నూతన పరిపాలన భవనం ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పడం లేదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాత భవనం ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల అవసరాలకు సరిపోవడం లేదని ప్రతిపక్ష కార్పొరేటర్లు చెబుతున్నారు.

Negligence on VMC New Building Construction: చంద్రబాబు ప్రారంభించారని జగన్ సర్కారు వివక్ష.. పిల్లర్ల దశలోనే వీఎంసీ భవనం

Government Neglect on Kurupam Tribal Engineering College: మూడేళ్లుగా కలగానే కురుపాం ఇంజినీరింగ్ కళాశాల.. నిధులు ఇవ్వకపోవడమేనా?

సుమారు 30 కోట్ల రూపాయలతో ఏడు అంతస్థుల్లో నిర్మించతలపెట్టిన నూతన భవనం ఏళ్లు గడుస్తున్నా నాలుగు అంతస్థులు పిల్లర్లకు మాత్రమే పరిమితమయ్యింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన పరిపాలన భవనం నేటికీ పూర్తికాకపోవడంపై ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మండిపడుతున్నారు. గతంలో నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారుకు బిల్లులు సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని చెబుతున్నారు.

వైసీపీ అనుకూల గుత్తేదారులకు రివర్స్ టెండరింగ్ పేరుతో కట్టబెట్టాలని అధికార పక్షం చూస్తోందని అని ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ప్రతీ దానిలో వైసీపీ నాయకులు వాటాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Hostels Construction Stalled in Krishna University: కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రశ్నార్థకంగా వసతి గృహాల నిర్మాణం.. విద్యార్థులపై ఆర్థిక భారం

"విజయవాడ నగరపాలక సంస్థ భవన నిర్మాణ పనులు పదేళ్ల కిందట ప్రారంభించారు. ఇప్పటికీ పిల్లర్లే ఉన్నాయి కానీ భవన నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత.. రివర్స్ టెండరింగ్ అనుసరించడం ద్వారా సంవత్సరాల తరబడి పనులు పెండింగ్​లో ఉన్నాయి. ప్రజాధనం దుర్వినియోగం ఎలా చేయాలో అన్నది.. ఈ భవన నిర్మాణాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రతి సంవత్సరం అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు. పాలకులు, అధికారులు సకాలంలో నిర్మించి ఉంటే.. ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది కాదు". - సత్తిబాబు, సీపీఎం, వీఎంసీ ఫ్లోర్ లీడర్

"ఈ భవనం 2015లో ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు. కార్పొరేషన్​కు ఆదాయం రావాలని 32 కోట్లతో దీని నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికి నాలుగు ఫ్లోర్ల నిర్మాణం కూడా జరిగింది. ఈ లోపు అధికారం మారడంతో ఈ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. ఇది పూర్తై ఉంటే కార్పొరేషన్​కు భారీగా నిధులు వచ్చేవి. ఈ ప్రభుత్వ ఆదాయ వనరులపై దృష్టి పెట్టడం లేదు. ఇందులో పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారింది". - బాలస్వామి, టీడీపీ, విఎంసీ ఫ్లోర్ లీడర్

AP Govt Did Not Allocate Funds to Barrages: ఏటా వందల టీఎంసీల నీరు సముద్రం పాలు.. అయినా, బ్యారేజీల నిర్మాణాలపై నిర్లక్ష్యం

Last Updated : Oct 9, 2023, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details