National Level Bull Competitions In NTR District: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నాయకత్వంలో.. ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు నాలుగో రోజు జోరుగా సాగాయి. 20 నిమిషాల వ్యవధిలో బండను ఎక్కువ దూరం లాగిన ఎద్దులను విజేతలుగా ప్రకటించారు. ఆరు పళ్లు పరిమాణంలో బండ లాగుడు పోటీల్లో 16 జట్ల ఒంగోలు జాతి ఎద్దులు పోటీ పడ్డాయి. పోటీలను తిలకించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని వేరువేరు ప్రాంతాల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణ జిల్లా.. జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ,తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు.. ముఖ్య అతిథులుగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. నందిగామలో ఎద్దుల బండ లాగుడు పోటీలు - Edla Banda competitions led by Tangirala Soumya
National Level Bull Competitions In NTR District: నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు.. ఈ పోటీలకు నలుదిక్కుల ప్రాంతాల నుంచి వేలాది మంది పోటీలకు హాజరయ్యారు.
నందిగామలో ఎద్దుల బండ లాగుడు పోటీలు