ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kodi Kathi Case: కోడి కత్తి కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా - కొడి కత్తి కేసు విచారణ తాజా వార్తలు

Kodi Kathi Case : విశాఖపట్నం విమానాశ్రయంలో 2019 సంవత్సరంలో జగన్​పై జరిగిన కోడి కత్తి దాడి.. రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసుపై జాతీయ దర్యాప్తు బృదం విచారణ చేపట్టగా.. లోతైన దర్యాప్తు అవసరమని సీఎం జగన్​ విజయవాడ కోర్టును ఆశ్రయించారు.

కోడి కత్తి కేసు
కోడి కత్తి కేసు

By

Published : Apr 17, 2023, 6:09 PM IST

Updated : Apr 17, 2023, 7:07 PM IST

Kodi Kathi Case in NIA Court : కోడి కత్తి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం విచారణ జరపగా.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనాలు వినిపించగా.. తమ వాదనలు వినిపించటానికి ఎన్​ఐఏఏ తరఫు న్యాయవాది సమయం కావాలని కోర్టును గడువు కోరారు. దీంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. కోడి కత్తి కేసు నిందితుడు న్యాయస్థానంలో హాజరు కాగా.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం​ హాజరు కాలేదు.

కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు అవసరమని ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి గతంలో పిటిషన్​ దాఖాలు చేశారు. ఈ పిటిషన్​పై​ ఎన్​ఐఏ న్యాయస్థానం ఈ రోజు విచారణ జరిపింది. జగన్‌, ఎన్‌ఐఏ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ విచారణకు కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు న్యాయస్థానంలో హాజరయ్యారు. జగన్​ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోడి కత్తి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన 23 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేసిందని కోర్టు ముందు ఉంచారు. అంత తక్కువ సమయంలో అభియోగపత్రం ఎలా దాఖలు చేయగలుగుతారని తన వాదనలు వినిపించారు. మొత్తం 39 సాక్షులను 5రోజుల్లోనే విచారించారని.. విచారణ జరిపిన సాక్ష్యాలను నమోదు చేశారని వివరించారు.

ట్రాఫిక్​ సమస్యల వల్ల రాలేకపోతున్నా : ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి తాను విచారణకు హాజరు కాలేకపోవటానికి గల కారణాలను కోర్టుకు తెలిపారు. ట్రాఫిక్​ ఇబ్బందుల వల్ల తాను విచారణకు హాజరుకాలేకపోతున్నానని న్యాయస్థానానికి తెలిపారు. సాక్ష్యం నమోదుకు అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించాలని జగన్‌ అభ్యర్థించారు. ఆన్‌లైన్‌ ద్వారానైనా సాక్ష్యం నమోదు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

జగన్​ కుట్రలు బయటపడుతున్నాయి :కోడి కత్తి కేసులో జాతీయ దర్యాప్తు బృందం వాస్తవాలను బయట పెట్టటం వల్ల జగన్​ రెడ్డి కుట్రలు బయటకు వస్తున్నాయని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అధికారంలోకి జగన్​ రావటానికి చేసిన దుర్మార్గాలు, కుతాంత్రాలు బయటపడుతున్నాయని అన్నారు. కోడి కత్తి నిజం తెలిసి ప్రజలు జగన్​మోహన్​ రెడ్డిని ఛీ కొడుతున్నారని అన్నారు. ఈ కేసు తాడేపల్లి కేసును కూడా తాకుతుందని దుయ్యబట్టారు.

"ఈ కేసులో మేము కోర్టుకు దృష్టికి తీసుకువచ్చిన అంశాలు.. ఎన్​ఐఏ దర్యాప్తులో ఏఏ ఆంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్​షీట్​ దాఖలు చేశారు. ఏ అంశాలలో దర్యాప్తు అవసరం ఉన్నదనేది తెలియజేస్తూ.. కోర్టు వారిని తదుపరి దర్యాప్తుకు ఆదేశించమని కోరాము."- జగన్​ తరఫు న్యాయవాది

"కోర్టు విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షించాలని నేను ఆశిస్తున్నాను. జగన్​ వచ్చి సాక్ష్యం చెప్పాలి.. అక్కడే విచారణ ఆగింది అనుకుంటున్నాను."-నిందితుడి తరఫు న్యాయవాది

కోడి కత్తి కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా

ఇవీ చదవండి :

Last Updated : Apr 17, 2023, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details