Nara Lokesh Tweet on YCP Government:రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా తయారైన రోడ్ల దుస్థితిపై.. తెలుగుదేశం-జనసేన పార్టీలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో ఈ నెల 18, 19 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న రోడ్ల దుస్థితిపై.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని వెల్లడించాయి. గుంతల రాజ్యాంలో ఏపీ, వై ఏపీ హేట్స్ జగన్ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు చేయాలని, సైకో సర్కారు మొద్దునిద్ర వదిలించాలని పిలుపునిచ్చాయి.
'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో నిరసనలకు టీడీపీ, జనసేన పిలుపు Nara Lokesh Fire on Cm Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ 'గుంతల ఆంధ్రప్రదేశ్'గా మారిపోయిందని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా ధ్వజమెత్తారు. ఈ నెల 18, 19 తేదీల్లో 'మీ మీ ప్రాంతాల్లో ఉన్న గుంతలు, అధ్వాన్న రోడ్ల ఫోటోలు, వీడియోలు తీసి #GunthalaRajyamAP, #WhyAPHatesJagan అనే హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియా'లో పోస్ట్ చేయాలని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
'చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైసీపీ దొంగ లేఖ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం దూరం'
Nara Lokesh Tweet Deatils: ''బాహుబలిలో కుంతల రాజ్యం చూశాం. సైకో జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా గుంతల రాజ్యమైంది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. టిడిపి-జనసేన సంయుక్తంగా 18,19 తేదీలలో మీమీ ప్రాంతాల్లో ఉన్న గుంతలు, అధ్వాన రోడ్ల ఫోటోలు, వీడియోలు తీసి #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్‌లతో వివరాలు రాసి సోషల్ మీడియా అక్కౌంట్లలో పోస్టు చేయండి. సైకో సర్కారు మొద్దునిద్ర వదిలించండి.'' అని ట్విటర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
Nara Lokesh Open Letter to CM Jagan: ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలి.. సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ
Nara Lokesh On Drought Conditions: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు కోరల్లో చిక్కిన అన్నదాతలను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రయత్నమూ చేయలేదని విమర్శించారు. సైకో జగన్ సర్కారు పాలనలో.. 24 లక్షల ఎకరాల్లో రైతులు కనీసం విత్తనమే వేయలేదంటే, వర్షాభావ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం అవుతోందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాధారణ పంట విస్తీర్ణం 86 లక్షల ఎకరాలుంటే, పంట వేసింది 62 లక్షల ఎకరాల్లో మాత్రమేనని లోకేశ్ వెల్లడించారు. జగన్, కరవు కవలలు లాంటి వారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల్ని ఓడించిన జగన్ పనైపోయిందని.. ఐరన్ లెగ్ జగన్‌ని ఏపీ మొత్తం ద్వేషిస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh on Psycho Jaganasura: 'దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం'