Nara Lokesh Padayatra in NTR District : వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాలూ కుదేలయ్యాయని.. వివిధ రంగాల ప్రతినిధులు లోకేశ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరల మోతతో రవాణా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారని గోడు వెల్లబోసుకున్నారు. ఎందరికో ఉపాధి కల్పిస్తున్న ఆటోనగర్‌ను ప్రైవేటీకరించేందుకు జీవో తెచ్చారని.. అది అమలైతే లక్షల మంది రోడ్డున పడతారని వివరించారు. సమస్యలను విన్న లోకేశ్.. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని ఆటోనగర్‌లకు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఏ రాష్ట్రంలో తక్కువ పన్నులు అమల్లో ఉన్నాయో అధ్యయనం చేసి ఏపీలో అమలు చేస్తామని.. దశల వారీగా ఇంధన ధరలు తగ్గించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
బెజవాడలో తెలుగుదేశం మీసం మెలేసింది.. లోకేశ్ యువగళంకు బ్రహ్మరథం
Autonagar Representatives met Lokesh: యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్.. విజయవాడ ఆటోనగర్‌లో పని చేసే 20కి రంగాలకు పైగా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఏపీలో రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లోకేశ్‌కు లారీ యాజమానుల సంఘం ప్రతినిధులు వివరించారు. గ్రీన్‌ట్యాక్స్ పేరుతో నిలువునా దోపిడీ చేయడంతో పాటు వివిధ రకాల పన్నులు, జరిమానాలు, ఇంధన ధరల మోతతో కోలుకోలేని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Lokesh Fires on CM Jagan: ఆటోనగర్‌ను ప్రైవేటీకరిస్తామని లక్షల మందిని రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని.. దీనిని అడ్డుకోవాలని కోరారు. ఆటోనగర్‌తో ముడిపడి ఉన్న ఎన్నో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నాయని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఆటోనగర్‌లో పనిచేస్తున్న కార్మికులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని.. ఇలా అనేక సమస్యలు వివరించారు.
Lokesh Defamation Case on Posani: అసత్య ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టను: లోకేశ్
"టీడీపీ హయాంలో 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్‌ను నేడు వైసీపీ ప్రభుత్వం.. 26వేల 860 రూపాయలు విధించింది. రెండు వేల రూపాయలు ఉండే ఓవర్ లోడ్ పన్నును.. 20వేల రూపాయలకు పెంచారు. ఇన్ని సంవత్సరాలు లారీలు నడుపుకుని బతికిన వారు ఇప్పుడు రోడ్డున పడ్డారు." -రవాణా రంగం ప్రతినిధి