Nara Lokesh Fire on CM Jagan :నాలుగున్నరేళ్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని దుయ్యబట్టారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) సమీపంలోని విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆస్పత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల దుస్థితి.. జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. నల్లమల అటవీ (Nallamala Forest) ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాస్పత్రిలో మూడు సంవత్సరాలుగా చెట్ల కిందే వైద్య సేవలు (Medical Services Under the Tree) అందిస్తున్నారంటే సీఎం సిగ్గుతో తలదించుకోవాలంటూ ఆయన నిప్పులు చెరిగారు
చెట్టు కింద వైద్యం :రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజిని సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. అల్లూరి జిల్లా లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడే దిక్క అని నారా లోకేశ్ అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే.. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశామని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ దివాలా కోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనా స్పత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్ల ఎదుట కన్పిస్తుంటే.. తమ హయాంలో వైద్య, ఆరోగ్య రంగం వెలిగి పోతుందని, జగనన్న ఆరోగ్య సురక్ష(Jagananna Arogya Suraksha) పేరుతో ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలని లోకేశ్ దుయ్యబట్టారు.
చెట్టు కింద వైద్యం, ఆరోగ్యశాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇంత దారుణమా!