ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'24 గంటలు సమయమిస్తున్నా.. ఆధారాలు చూపించండి' - nara lokesh challenges to ysrcp

Nara Lokesh Challenge to YSRCP: వైసీపీ నాయకులు తనపై చేసిన ఆరోపణలు ఆధారాలు నిరూపించాలని.. ఇందుకు 24 గంటలు సమయమిస్తున్నానని నారా లోకేశ్​ సవాల్​ విసిరారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్​.. తనపై 7 అంశాల్లో ఆరోపణలు చేశారని.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారన్నారు. తనపై ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు.

Nara Lokesh
నారా లోకేశ్

By

Published : Dec 7, 2022, 7:59 PM IST

Nara Lokesh Challenge to YSRCP: స్కిల్​ డెవలప్​మెంట్​లో తనపై చేసిన అవినీతీ అరోపణలు.. దమ్ముటే ఆధారాలతో నిరూపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సవాల్​ విసిరారు. ఇందుకు 24 గంటలు సమయమిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో నిడమర్రు గ్రామంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. జగన్​ ప్రజలను పెడుతున్న బాధలన్నీ వింటున్నానని.. వైసీపీ నేతలు ప్రజాసమస్యలు వినాలని సూచించారు. ఇళ్ల కూల్చివేతకు అధికారులు నోటీసులు ఇచ్చారని.. స్థానిక మహిళలు లోకేశ్​ దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పుడొచ్చి ఇళ్లు కూలుస్తారోననే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభ నిర్వహించటం లేదని.. వాలంటీర్లకు సమస్య చెప్తే.. వారు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పోరాటం చేసైనా సరే.. మీకు న్యాయం చేసేలా చూస్తానని లోకేశ్​ హామీ ఇచ్చారు. మంగళగిరిలో 10వేల ఇళ్లు కట్టించి తీరుతామని లోకేశ్​ ప్రజలకు హామీ ఇచ్చారు.

జగన్‌.. ప్రజలను పెడుతున్న బాధలను వింటున్నా.. కంటున్నా.. వైకాపా నేతలు రోడ్డుపైకి వచ్చి ప్రజాసమస్యలు వినాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి అంటూ నాపై ఆరోపణలు చేశారు. మరో 24 గంటల సమయం ఇస్తున్నా.. ఆధారాలు చూపించాలి. నాపై 7 అంశాల్లో ఆరోపణలు చేశారు.. ఒక్కటీ నిరూపించ లేదు. నాపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా. -నారా లోకేశ్​,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details