ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Adimulapu Suresh: చిన్న చిన్న పనులకు కాంట్రాక్టర్లు వెంటనే బిల్లులు కావాలంటే ఎలా: ఆదిమూలపు సురేష్

Municipal Minister Adimulapu Suresh: మున్సిపాలిటీల్లో చేసే చిన్న చిన్న పనులకు.. కాంట్రాక్టర్లు వెంటనే బిల్లులు కావాలంటే ఎలా అని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సాధారణంగా ప్రభుత్వ పనులకు బిల్లులు ఆలస్యంగానే వస్తాయన్నారు. పుర, పట్టణాభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు 510కోట్ల పెండిగ్‌ బిల్లులు చెల్లించామని సురేష్‌ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా చెత్తపన్ను అనేది లేదు, అది యూజర్ ఛార్జీ మాత్రమే అని వ్యాఖ్యానించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 5, 2023, 10:22 PM IST

Updated : Jun 6, 2023, 6:22 AM IST

పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

Minister Adimulapu Suresh key comments: మున్సిపాలిటీల్లో చేసే చిన్న చిన్న పనులకు కాంట్రాక్టర్లు వెంటనే బిల్లులు కావాలంటే ఎలా అని పురపాలక శాఖమంత్రి ఆదిమూలపు సురేష్ప్రశ్నించారు. సాధారణంగా ప్రభుత్వ పనులకు బిల్లులు ఆలస్యంగానే వస్తాయన్నారు. మున్సిపాలిటీలు చిన్న చిన్న పనుల్ని ప్యాకేజీలుగా చేసి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదన్నారు. ఇంటి పన్ను పెరిగినా ప్రభుత్వం వసూలు చేసింది చాలా తక్కువని పేర్కొన్నారు. ఇంటి పన్ను బకాయిలు ఒకేసారి చెల్లిస్తే వడ్డీ మాఫీ ఉండబోదని ప్రకటించామని గుర్తుచేశారు. ప్రభుత్వానికి ఈ మాఫీ వల్ల 3,500 కోట్ల భారం భరిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా చెత్తపన్ను అనేది లేదు అది యూజర్ ఛార్జీ మాత్రమే అని వ్యాఖ్యానించారు.

భాస్కరరెడ్డి అరెస్ట్​పై ఆదిమూలపు సురేశ్ కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రంలోని 123 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించ లేదనటం అవాస్తవమనిమంత్రి ఆదిమూలపు సురేష్స్పష్టం చేశారు. సీఎఫ్ఏంఎస్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులు అన్ని క్లియర్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ 510 కోట్లు క్లియర్ అయ్యాయన్నారు. విద్యుత్ బిల్లులు, సచివాలయం అద్దెలు ఇలా వేర్వేరు వ్యయాలకు సంబంధించిన బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. పెండింగ్ పనులను సంబధించిన నిధులు కొరత కూడా లేదని వివరించారు. ఏ మున్సిపాలిటీ కి సంబధించిన బిల్లులు కూడా పెండింగ్​లో లేవని తేల్చిచెప్పారు. కొన్ని బిల్లులు చెల్లింపుల్లో కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీఎఫ్ఏంఎస్ వల్లే ఆలస్యం జరుగుతోందన్నారు. అమృత్ సిటీస్ కోసం 300 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఏపీలోని మున్సిపాలిటీల్లో 2000 కోట్ల వరకూ పన్ను వసూళ్లు జరిగాయని వెల్లడించారు. కొన్ని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రారని.., దాన్ని భూత అద్దంలో చూపితే ఎలా అని ప్రశ్నించారు.

ఇప్పటికే కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసింది: మంత్రి సురేశ్

పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: చెత్తపన్ను ప్రజలే స్వచ్చంధంగా కడుతుంటే మీడియాకు వచ్చిన ఇబ్బందేమిటని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ప్రశ్నించారు. చెత్తపన్ను వసూలు చేసుకోవాలని ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే ప్రతిపాదించాయన్నారు. ప్రభుత్వం ఏమీ అభ్యంతరం చెప్పలేదని.., అందుకే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. మున్సిపాలిటీలు ఇళ్ల నుంచి రోజూ చెత్త తీయాలా? లేక వారానికి ఓ మారు తీయాలా? అని ప్రశ్నించారు. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ వ్యర్ధాల నిర్వహణపై సమీక్షించి వివిధ రాష్ట్రాలకు 2 వేల కోట్ల వరకూ జరిమానా వేసిందన్నారు. ఏపీ ఒక్కటే ఆ జరిమానా నుంచి తప్పించుకోగలిగిందని వెల్లడించారు. యూజర్ ఛార్జీల లాంటి సంస్కరణలు అమలు చేయబట్టే కేంద్రం ఏపీకి అదనంగా 645 కోట్లు ఇచ్చిందన్నారు.

Last Updated : Jun 6, 2023, 6:22 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details