ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని కన్న తల్లే హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాల కోటయ్య లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పదేళ్ల క్రితం శిరీషతో వివాహం కాగా.. వారికి ఇద్దరు ఆడపిల్లలు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తటంతో.. ఇరువురూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి పిల్లల ఆలానాపాలనా నానమ్మ చిట్టెమ్మే చూసుకుంటోంది.
మత్తుకు బానిసై వేధింపులు.. కుమారుడిని హతమార్చిన తల్లి - కుమారుడిని చంపిన తల్లి వార్తలు
కన్నకొడుకు పెట్టే బాధలు భరించలేక.. కన్నతల్లే హతమార్చిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో చోటుచేసుకుంది. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండటంతో ఓ తల్లి తన కుమారుడిని గొడ్డలితో నరికేసింది.
అయితే.. మద్యానికి బానిసైన బాలకోటయ్య గత కొంత కాలంగా తన కుమార్తెలతో పాటు తల్లి చిట్టెమ్మతోనూ ఘర్షణకు పడేవాడు. ఈ క్రమంలోనే ఇవాళ తన కుమార్తెలతో పాటు తల్లి చిట్టెమ్మపై దాడి చేశాడు. దీంతో వారు తమ ఇంటి సమీపంలోని లింగమ్మ అనే మహిళ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అక్కడకు వెళ్లిన బాలకోటయ్య.. లింగమ్మపై దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆగ్రహించిన తల్లి చిట్టెమ్మ.. బాలకోటయ్యపై గొడ్డలితో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన బాలకోటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:'బదిలీ కావాలంటే భార్యను పంపించు'.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య