MLC Ashokbabu: వైకాపా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అశోక్బాబు సవాల్ విసిరారు. కార్యదర్శులు, వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏ నెల జీతం.. ఆ నెల ఇచ్చినట్లు చూపితే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులు 13 లక్షల మందికి ఏ నెల జీతం ఆ నెల చెల్లించడం లేదని మండిపడ్డారు. వీరికి ఏ నెల జీతం ఆ నెల ఇచ్చినట్లు చూపలేకపోతే.. ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవంబర్ నెల 9వ తేదీ వచ్చినా ఇంతవరకు జీతాలు లేవని మండిపడ్డారు. పోలీసు, హెల్త్, డిపార్టుమెంట్లు తప్ప టీచర్లకు, మున్సిపల్ ఉద్యోగులకు పెన్షన్లు రాలేదని.. ఎప్పుడొస్తాయో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్గా జీతాలు ఇవ్వలేని ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని అశోక్ విమర్శించారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి పన్నులు మాత్రం ఒక్క రూపాయి ఆగకుండా వెళ్తున్నాయన్నారు. స్కూల్ డ్రాపవుట్స్పై విద్యాశాఖ మంత్రి, సెక్రటరి చెప్పే వాటికి పొంతన లేదని ఆక్షేపించారు.
వైకాపా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్.. ఎందుకోసమంటే..!
MLC Ashokbabu: ఉద్యోగుల వేతనాల విషయంలో వైకాపా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అశోక్బాబు సవాల్ విసిరారు. ఉద్యోగులకు ఎప్పటికప్పుడు జీతాలు ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
ఎమ్మెల్సీ అశోక్బాబు