ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సలహాదారులు, వాలంటీర్ల కోసం ఉద్యోగులు ఇబ్బంది పడాలా..!'

By

Published : Dec 13, 2022, 5:23 PM IST

MLC Ashok Babu: ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి భయపడుతున్నారా.. లేక ఇతర ఆశలకు లొంగిపోయారా అని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ఉద్యోగులకు నేటికీ జీతాలు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సలహాదారులు, వాలంటీర్ల ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.

MLC Ashok Babu
ఎమ్మెల్సీ అశోక్ బాబు

MLC Ashok Babu fires on Government: ఎప్పుడో 1950ల నాటి పరిస్థితిని ఇప్పుడు ఉద్యోగులు అనుభవిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై, ఉద్యోగులకు నేటికీ జీతాలు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేదానిపై కేంద్రం ఆలోచించాలని కోరారు. ఉద్యోగసంఘ నేతలు ప్రభుత్వానికి భయపడుతున్నారా... లేక ఇతర ఆశలకు లొంగిపోయారా అని ప్రశ్నించారు. ఉద్యోగులను వైసీపీ నేత కాళ్లు పట్టుకోవాలన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. 13వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వమే.. కాళ్లు పట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ప్రభుత్వం విధానలోపం వల్ల ఉద్యోగులు కష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే ఉద్యోగులకు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సలహాదారులు, వాలంటీర్ల ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడాలని అశోక్ బాబు నిలదీశారు.

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details