Gadapa Gadapa In Ntr District : ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం చండ్రుపట్ల తండాలో ఎమ్మెల్యే రక్షణనిధిని గిరిజనులు నిలదీశారు. రోడ్లు, డ్రైనేజీ పనులు అస్సలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదని ఓ యువకుడు ప్రశ్నించారు. గొంతు పెంచి మాట్లాడుతున్నావంటూ యువకుడిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. అడిగిన వాటికి జవాబు చెప్పనప్పుడు గడప గడపకు కార్యక్రమంతో ఉపయోగమేంటని స్థానికులు పెదవి విరిచారు.
‘అడిగినదానికి జవాబు చెప్పనప్పుడు.. గడప గడపకు ఎందుకు?’.. నిలదీసిన స్థానికులు - చండ్రుపట్ల తండా
Gadapa Gadapa Program : రాష్ట్రంలో గడప గడప కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. అక్కడి నుంచి వెళ్లడమో లేక ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేని గిరిజనులు నిలదీశారు.
![‘అడిగినదానికి జవాబు చెప్పనప్పుడు.. గడప గడపకు ఎందుకు?’.. నిలదీసిన స్థానికులు Gadapa Gadapa In Ntr District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16362770-525-16362770-1663080471495.jpg)
Gadapa Gadapa In Ntr District
గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధికి చేదు అనుభవం