BOTSA SATYANARAYANA : విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు చేయాలని అధికార పార్టీ చూస్తుండగా.. ప్రతిపక్షం మాత్రం గతంలోనే విశాఖను ఆర్థిక రాజధానిగా నిర్మించేందుకు గతంలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అంటోంది. అయితే విశాఖ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ తరచూ స్పందిస్తున్నారు. బుధవారం స్పందిస్తూ.. రాజధానిని ఈరోజు నుంచే విశాఖకు తరలించాలన్నది తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏ క్షణంలోనైనా విశాఖకు వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దానికి అనుగుణంగానే తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
ఏ క్షణమైనా విశాఖకు వెళ్లేందుకు సిద్ధం: మంత్రి బొత్స
BOTSA SATYANARAYANA : విశాఖ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలోనే విశాఖకు రాజధాని తరలివస్తుందనీ.. అది ప్రభుత్వ విధానమని ఇటీవలే ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసి కనీసం దాదాపు వారం రోజులు గడవక ముందే మరోసారి రాజధాని అంశంపై వ్యాఖ్యలు చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
నూతన సవంత్సరం రోజు విశాఖ రాజధానిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. త్వరలో విశాఖలో రాజధాని ఏర్పడుతుందని.. విశాఖకు రాజధాని తరలిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర కార్యాలయాలూ తరలివస్తామని అన్నారు.
ఇవీ చదవండి: