ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనింగ్ లక్ష్యాలపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

Minister of Mines Peddireddy Reviews On Mining Targets: రాష్ట్రంలో ఆదాయ లక్ష్యానికి అనుగుణంగా మైనింగ్ రెవెన్యూను సాధించాలని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ఏపీలో ఉన్న అపారమైన ఖనిజవనరుల్ని వెలికి తీసి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పరిశ్రమలకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.

పెద్దిరెడ్డి
peddireddy

By

Published : Dec 15, 2022, 10:23 AM IST

Minister of Mines Peddireddy Reviews On Mining Targets: రాష్ట్రంలో ఆదాయ లక్ష్యానికి అనుగుణంగా మైనింగ్ రెవెన్యూను సాధించాలని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. పారదర్శ మైనింగ్ ప్రక్రియలో భాగంగా ఇ-ఆక్షన్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం అనే విధానం ఉండేదని, ప్రస్తుతం ఆన్ లైన్ విధానం ద్వారా అర్హులైన వారికి, కొత్తవారికి మైనింగ్ అవకాశాలు లభిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీలో ఉన్న అపారమైన ఖనిజవనరుల్ని వెలికి తీసి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పరిశ్రమలకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.

గుర్తించిన అన్ని మైనింగ్ ప్రాంతాల్లోనూ త్వరితగతిన తవ్వకాలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గనులు లీజుకు తీసుకుని మైనింగ్ ప్రారంభించని చోట నోటీసులు జారీచేసి అనుమతులు రద్దు చేయాలని మంత్రి స్ఫష్టం చేశారు. ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయలు మైనింగ్ ఆదాయం లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సూచించారు. సీనరేజీ వసూళ్ళను ఔట్ సోర్సింగ్ కింద చేపట్టడం ద్వారా మైనింగ్ ఆదాయం పెరుగుదలను పరిశీలించాలని, అన్ని ప్రాంతాల్లోనూ వర్తింపచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details