KTR meets Satya Nadella: భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నారు. నగరానికి వచ్చిన సత్య నాదేళ్లతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళ్టి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మట్లాడుకున్నాం' అని కేటీఆర్ పేర్కొన్నారు.
సత్య నాదెళ్లతో మంత్రి కేటీఆర్ బిర్యానీ ముచ్చట్లు - మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ
KTR meets Satya Nadella: భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. బిజినెస్, బిర్యానిపై సత్య నాదెళ్లతో చర్చించినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR meets Satya Nadella
రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్‌లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు కేటీఆర్ వివరించినట్లు సమాచారం. కొత్త సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. నిన్న ప్రధాని మోదీతోనూ సత్య నాదెళ్ల సమావేశమయ్యారు.
ఇవీ చదవండి: