KTR Inaugaration Silver Saree: చేనేత కళాకారుల ప్రతిభకు పుట్టినిల్లయిన తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన నల్లా విజయ్ తయారు చేసిన.. సువాసనలు వెదజల్లే వెండిచీరను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ చీర తయారీ కోసం సుగంధ ద్రవ్యాలు, వెండిని ఉపయోగించటంతోపాటు సుమారు నెలన్నర రోజులు శ్రమించి మగ్గంపై నేసినట్లు.. విజయ్ తెలిపారు. ఇప్పటిదాకా విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తుల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నేతన్నల అద్భుత ప్రతిభకు విజయ్ నిదర్శనమని కేటీఆర్ ప్రశంసించారు. సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించిన మంత్రి కేటీఆర్.. విజయ్‌కి అన్నిరకాల సహాయసహకారాలను అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
సువాసనలు వెదజల్లే వెండి చేనేత చీరను చూశారా..! అయితే, మీరు తెలంగాణకు వెళ్లాల్సిందే! - ఏవీ వార్తలు
KTR Inaugaration Silver Saree: సిరిసిల్లా చేనేత కళాకారుడు నేసిన వెండి సువాసనలు వెదజల్లే చీరను ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. నేతన్న విజయ్ను ప్రశంసించారు. సుమారు నెలన్నర రోజులు శ్రమించి మగ్గంపై నేశారు. విజయ్‌కు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కేటీఆర్