ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సదర్​ ఉత్సవాలను తెలంగాణ తరఫున అధికారికంగా నిర్వహిస్తాం' - harishrao latest news

Ktr Comments at Yadava kurma Sammelanam: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్ర నలుమూలలకు వ్యాపించిన సదర్‌ ఉత్సవాలనూ ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పదకొండు వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Ktr Comments at Yadava kurma Sammelanam
Ktr Comments at Yadava kurma Sammelanam

By

Published : Oct 26, 2022, 7:59 PM IST

Ktr Comments at Yadava kurma Sammelanam: తెలంగాణ నలుమూలలకు వ్యాపించిన సదర్‌ ఉత్సవాలనూ ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. రంగారెడ్ది జిల్లాలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో యాదవ-కురమ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాకముందు రాష్ట్రంలో గొల్ల కురుమల పరిస్థితి, కులవృత్తులకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉండేది అని ప్రశ్నించారు. స్వరాష్ట్రం వచ్చాక ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రం రాకముందు రెండు లక్షల 21 వేల మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకం దారుల సొసైటీలో మెంబర్లుగా ఉండేవారని.. ఆ సంఖ్య ఈరోజు ఏడు లక్షల 61 వేలకు పెరిగిన మాట వాస్తవమా కాదా అని వ్యాఖ్యానించారు. పదకొండు వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు.

బయటి వాళ్లు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం ఏంటో తెలవడం లేదు.. దేశంలో తెలంగాణ పథకాలు నెంబర్​వన్​గా ఉన్నాయని.. కేంద్ర మంత్రులైన పురుషోత్తం రూపాల, గిరిరాజ్ సింగ్ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ని ప్రశంసించారని తెలిపారు. బయటి వాళ్లు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడం లేదన్నారు. పరిశ్రమలు అంటే అంబానీ, ఆదానీలు మాత్రమే కాదు.. తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటేనే దేశం బాగుంటుందనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్​కు అండగా ఉండాలి.. గొల్ల కురుమలకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. అప్పు లేకుండా 75% గొర్రె పిల్లలను ఇచ్చామన్నారు. తెరాస ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్న హరీశ్​రావు.. కేసీఆర్​కు అండగా ఉండాలన్నారు. త్వరలోనే హైదరాబాద్​లో గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాలు పూర్తి కానున్నట్లు తెలిపారు. వచ్చే నెల 6 తర్వాత అర్హులందరికీ గొర్రెల పంపిణీ యధావిధిగా కొనసాగుతుందని.. ఎవరూ దుష్ప్రచారం చేసిన నమ్మవద్దని మంత్రి హరీశ్​రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నోముల భగత్, బొల్లం మల్లయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details