ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Raja Shyamala Yagam: రాష్ట్ర సంక్షేమం కోసం రాజశ్యామల యాగం.. షెడ్యూల్​ ఇదే

Raja Shyamala Yagam: రాష్ట్ర సంక్షేమం కోసం త్వరలోనే రాజశ్యామల యాగం చేస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడ మున్సిపల్​ స్టేడియంలో దీనిని నిర్వహిస్తామని తెలిపారు. ఈ యాగానికి వచ్చినవారికి రెండు పూటలా నీరు, మజ్జిగ, ప్రసాదాలను అందజేస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Raja Shyamala Yagam In AP
Raja Shyamala Yagam In AP

By

Published : Apr 21, 2023, 5:48 PM IST

Raja Shyamala Yagam: రాష్ట్ర సంక్షేమం కోసం రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించామని దేవాదాయ శాఖ మంత్రు కొట్టు సత్యనారాయణ తెలిపారు. దీనిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేస్తున్నామని వెల్లడించారు. మే 12 తేదీ నుంచి మే 17వరకూ అంటే 6 రోజుల పాటు యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఒక్కో పీఠాధిపతిని ఆహ్వానిస్తున్నామన్నారు. మొత్తం 450 మంది రుత్వికులు ఈ యాగంలో పాల్గొంటారని వెల్లడించారు. యాగం నిర్వహణ కోసం దేవాదాయశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ యాగానికి రాష్ట్ర ప్రజలను ఆహ్వానించారు. వచ్చినవారికి రెండు పూటలా నీరు, మజ్జిగ, ప్రసాదాలను అందజేస్తామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.

"ఈ రాజశ్యామల యాగానికి ప్రతిరోజు ఒక్కో పీఠాధిపతిని ఆహ్వానిస్తున్నాం. యాగంలో 450 మంది రుత్వికులు పాల్గొంటారు.రాజశ్యామల యాగానికి ప్రజలకు ఆహ్వానం. యాగం చూసేందుకు వచ్చినవారికి నీరు, మజ్జిగ, ప్రసాదాలు ఇస్తాం. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం"-కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి

అందులో ఇబ్బంది ఏమి లేదు: పార్టీలు వేరైనా రాజకీయ నాయకులు పరస్పరం జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సామాజిక మాధ్యమాలు దీనికి వేర్వేరు భాష్యాలు చెబుతున్నాయన్నారు. యువగళం పాదయాత్రలో లోకేశ్​ ఆయనకు ఆయనే తిట్టుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీనీ నోటికి వచ్చినట్టు తిడితే ప్రజల మద్ధతు వస్తుందా అని ప్రశ్నించారు. లోకేశ్​ను పాదయాత్రలోనే జనం తరిమి కొడతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే బ్రోకర్ అని విమర్శించారు. ఆయన బినామీ ఆస్తులు ఎప్పుడో రెండు లక్షల కోట్లు దాటాయని ఆరోపించారు.

రాజశ్యామల యాగం అంటే ఏమిటి: రాజ్యలక్ష్మి వరించాలని.. విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయలక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ కూడా చాలా సార్లు రాజశ్యామల యాగం చేసి విజయాన్ని వరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్​లో కూడా రాజశ్యామల యాగం నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పగా.. దీనిపై పలు రకాల విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసమే దీనిని నిర్వహిస్తున్నామని చెప్తుంటే.. మరికొంతమంది మాత్రం రాబోయే ఎన్నికల్లో జగన్​ గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనే లక్ష్యంతోనే చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details