MINISTER KARUMURI ON CBN : వైసీపీలో అధ్యక్షుల మార్పు అనేది తమ పార్టీ నిరంతర ప్రక్రియ అని.. చంద్రబాబు వల్ల అధ్యక్షులను మార్చలేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. చంద్రబాబు వల్లే మార్చారని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు ఉక్రోశంతో రౌడీనంటూ దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎలాగో ఓడిపోతుందని తెలిసే.. తననైనా గెలిపించాలని చంద్రబాబు ప్రజలను బ్రతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించినందుకే ఇప్పటం గ్రామస్థులకు ఫైన్ వేసిందని తెలిపారు.