ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉన్నత విద్యా కోర్సుల్లో రికార్డు స్థాయిలో ప్రవేశాలు పెరిగాయి: మంత్రి బొత్స

Botsa Satyanarayana: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఈడీ ప్రవేశాలపై స్పందించారు. అలాగే ఈ సంవత్సరం ఉన్నత విద్యలో జరిగిన ప్రవేశాల వివరాలను వెల్లడించారు.

Education Minister Botsa Satyanarayana
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Nov 14, 2022, 10:25 PM IST

Education Minister Botsa Satyanarayana: బీఈడీ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల తనిఖీల తర్వాతే ప్రవేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తనిఖీల తర్వాతే గుర్తింపు రెన్యువల్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. రాష్ట్రంలోని ఉన్నత విద్యా కోర్సుల్లో రికార్డు స్థాయిలో ప్రవేశాలు పెరిగాయన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3లక్షల 15వేల 600 మంది విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందినట్టు వెల్లడించారు. ఇంటర్​లో ఉత్తీర్ణులైన 22వేల మంది విద్యార్థులు మినహా మిగిలిన వారంతా ఉన్నత విద్యకోసం దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.

  • ఇంజనీరింగ్ కోర్సుల్లో 1.2 లక్షల మంది
  • డిగ్రీ కోర్సుల్లో 1.48 లక్షల విద్యార్థులు
  • ఫార్మసీలో 12 వేలు
  • వ్యవసాయం- ఆక్వాకల్చర్ కోర్సుల్లో 5 వేలు
  • మెడికల్ నర్సింగ్ కోర్సుల్లో 15 వేలు
  • ఐఐఐటీ, ఎన్ఐటీలలో 5 వేల మంది
  • 10 వేల మంది ఇతర రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం

ABOUT THE AUTHOR

...view details