Minister Botsa Satyanarayana Fires on BJP: వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగాయని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా మాట్లాడారని విమర్శించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌పై సైతం మండిపడ్డారు. అమిత్ షా చెప్పే వరకూ జీవీఎల్ నరసింహరావుకు రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని తెలీదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదో.. జీవీఎల్ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా, జీవీఎల్ మాట్లాడారనే విషయం అర్ధమవుతోందని అన్నారు. గురివింద గింజల్లా.. తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని హితవు పలికారు. దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంటో.. ఆ పార్టీ నేతలు పరిశీలించుకోవాలని సూచించారు.
"అమిత్‌షా చెప్పేవరకూ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతిపై తెలియదా. ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదో జీవీఎల్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా, జీవీఎల్ మాట్లాడారని అర్థమవుతోంది. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలి. ప్రధానితో మా బంధం ఎలా ఉందో, అమిత్‌షాతోనూ అలానే ఉంది. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవు. అందరితో పాటు 2 వందేభారత్ రైళ్లు ఇవ్వటం తప్ప రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చింది. బీజేపీ నుంచి మాకు ఎలాంటి వెన్నుదన్ను ప్రత్యేకంగా లేదు."-బొత్స సత్యనారాయణ, మంత్రి