ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa on CPS issue: ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. పీఆర్సీ పెండింగ్ సమస్యలు, సీపీఎస్ అంశంపై సచివాలయంలో ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం సమాచార లోపం వల్లే సీపీఎస్ పై సమావేశం అని ఆర్ధికశాఖ అధికారులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు.

Minister Botsa
మంత్రి బొత్స

By

Published : Dec 6, 2022, 10:17 PM IST

Minister Botsa on CPS issue: ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. పీఆర్సీ పెండింగ్ సమస్యలు, సీపీఎస్ అంశంపై సచివాలయంలో ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం సమాచార లోపం వల్లే సీపీఎస్ పై సమావేశం అని ఆర్ధికశాఖ అధికారులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు.

మరికొన్ని ప్రభుత్వ విభాగాల్లో 62 ఏళ్ల వయోపరిమితి పెంచాల్సిందిగా ఉద్యోగులు కోరినట్టు ఆయన వివరించారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల ప్రతీ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. అంతకు ముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్, సజ్జల భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. తొలుత సీపీఎస్ అంశంపై చర్చించాలని నిర్ణయించినా సంబంధిత ఉద్యోగ సంఘాల నేతలు ఎవరూ హాజరు కాకపోవటంతో ఆఖరు నిముషంలో పీఆర్సీ పెండింగ్ సమస్యలు చర్చిద్దామని మంత్రుల కమిటీ సమాచారం పంపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details