ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న నిషేధిత భూముల అర్జీల పరిష్కారానికి.. ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక మేళా నిర్వహించారు. తొలిరోజు 155 అర్జీలకు మోక్షం కలిగించినట్లు కలెక్టరు ఎస్.ఢిల్లీరావు తెలిపారు. నిషేధిత భూముల సమస్య పరిష్కారం కోసం.. ఈనెల 30 వరకు మెగామేళాను విజయవాడలోని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా మొత్తం 125 అర్జీలు, పెండింగ్‌లోని 339 అర్జీలపై పరిశీలన చేయించామని అన్నారు. న్యాయబద్ధంగా.. అర్హత మేరకు విధివిధానాలు పరిశీలించి దరఖాస్తులకు పరిష్కారం చూపాలని ఆదేశించినట్లు.. కలెక్టరు ఢిల్లీరావు తెలిపారు.
నిషేధిత భూముల అర్జీల పరిష్కారం.. ఎన్టీఆర్ జిల్లాలో మెగామేళా! - ఎన్టీఆర్ జిల్లాలో నిషేదిత భూముల అర్జీల పరిష్కారం
నిషేధిత భూముల అర్జీల పరిష్కారానికి.. ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక మేళా నిర్వహించారు. ఈ భూముల సమస్య పరిష్కారం కోసం.. ఈనెల 30 వరకు మెగామేళాను విజయవాడలోని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు.. కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో మెగామేళా