Medical Contract Employees Dharna: ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ శానిటేషన్ బెస్ట్ కంట్రోల్ సెక్యూరిటీ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్‌ని ఆప్కాస్‌లో చేర్చాలని మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న వేతనమే తమకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
16వేల రూపాయల వేతనం ఇవ్వాలని జీవో ఇచ్చినా.. కాంట్రాక్ట్ ఏజెన్సీలు మాత్రం 10వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఏజెన్సీ ఒక్కోలా వేతనాలు చెల్లిస్తున్నారని, అవి కూడా సకాలంలో ఇవ్వడంలేదని వాపోయారు. ప్రభుత్వం మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ సమస్యలను పరిష్కరించి తమను ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
'ఆరోగ్యమిత్ర'లకు అన్నీ సమస్యలే! వేతన వెతలకు తోడు కొరవడిన ఉద్యోగ భద్రత
Workers Facing Problems in Vijayawada: మరోవైపు ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని విజయవాడ వచ్చిన ముఠా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులో 14 నుంచి 16గంటలు పని చేస్తున్నా కుటుంబ పోషణ కష్టమవుతోందని ముఠా కార్మికులు వాపోతున్నారు. ఉపాధి కోసం అప్పు చేసి లగేజీ ఆటోలు కొనుగోలు చేస్తే ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు, వేధింపులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.