ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Matrubhasha Mahasabha in Vijayawada: జొన్నవిత్తుల ఆధ్వర్యంలో మాతృభాష మహాసభ..

Matrubhasha Mahasabha in Vijayawada: తెలుగు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని భాషాభిమానులు పిలుపునిచ్చారు. విజయవాడలో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మాతృభాష మహాసభ జరిగింది. ఇందులో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

matrubhasha_mahasabha_in_vijayawada
matrubhasha_mahasabha_in_vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2023, 10:44 AM IST

Updated : Sep 6, 2023, 11:51 AM IST

Matrubhasha Mahasabha in Vijayawada:ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడలో మాతృభాష మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు విచ్చేశారు. మహాసభ ప్రారంభానికి ముందు లెనిన్ సెంటర్​లో ఉన్న విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగు భాషా అంతరించిపోతుందనే భయం కలుగుతోందని జొన్నవిత్తుల తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆలోచనలో నేటి సమాజం ఉందన్నారు. ఆంగ్లభాషను నేర్చుకోవడం తప్పు కాదని కానీ.. ఆ నెపంతో తెలుగును మరుగుపర్చడం దారుణామన్నారు. నేడు ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

Former Vice President Venkaiah Naidu: మాతృభాష వల్లే నిజమైన భావ వ్యక్తీకరణ: వెంకయ్యనాయుడు

BJP State President Daggubati Purandeshwari:భావి తరాలకు తెలుగును అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తాము చిన్నతనంలో మద్రాస్​లో ఉన్న సమయంలో తమకు తెలుగు భాషాను చెప్పేందుకు తమ తండ్రి ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయులను నియమించి తమకు తెలుగును బోధించారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మాతృభాషపై మహాసభను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దక్షిణ ఆసియాలో 24 ద్రవిడ భాషల్లో అత్యధిక మంది వినియోగించిన భాష తెలుగన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయని గుర్తు చేశారు.

విద్యా బోధన మాతృభాషలో జరిగితేనే అన్ని విధాలా సత్ఫలితాలు: ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

Former CBI Joint Director Lakshminarayana:ప్రస్తుతం చాలా తక్కువ మంది తెలుగు మాట్లాడుతున్నారు.. రాపోయే కాలంలో తెలుగు ఎవరు మాట్లాడరేమో అనే భయం ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాష వల్ల మాత్రమే ఉద్యోగాలు రావడం లేదని ఆసంగతి గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజల్లో ఇటువంటి ఆలోచన ధోరణి మారాలన్నారు. ప్రస్తుతం తెలుగు భాష గొప్పదం గురించి మాట్లాడుకుంటూనే తెలుగు భాషను ఎలా రక్షించాలో.. భావి తరాలకు ఎలా భాషను అందించాలన్న దానిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. తెలుగు భాషా పరిరక్షణకుమనకు వంద విశ్వనాధ సత్యనారాయణలు, వంద కందుకూరి వీరేశలింగంలు కావాల్సి ఉందన్నారు.

HC on Mother Tongue: గతంలో మాతృభాష రాకపోతే సిగ్గుపడేవారు.. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు: హైకోర్టు

Former Deputy Chairman Buddha Prasad:తాను తెలుగు భాషా ఉద్యమంలో సఫలీకృతం అయ్యానా లేదా అనేది తెలీడం లేదని మాజీ ఉప సభాపతి బుద్ద ప్రసాద్ అన్నారు. తాను చిన్నతనం నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నానని తెలిపారు. ఇప్పుడు అందరూ ఇంగ్లీషులోనే చదువుతున్నారని వివరించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆంగ్లభాషా నేర్చుకోవడంలో తప్పేది కాదని కానీ తెలుగు భాషాపై నిర్లక్ష్యం తగదన్నారు.

Congress Leader Tulasi Reddy:తెలుగు అక్షరాలు చదవలేని పిల్లలు 8వ తరగతిలో సైతం 2.3 శాతం మంది ఉన్నారని నివేదికలు తెలుపుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఏడవ భాష తెలుగేనని తెలిపారు. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈష్ట్ అని నికోలిస్ అన్నారని.. సీపీ బ్రౌన్ సైతం తెలుగు నేర్చుకున్నారని వివరించారు. అంతటి ఖ్యాతి కలిగిన తెలుగు భాషా మృతభాషగా మిగిలిపోతుందేమో అని భయమేస్తోందన్నారు. శ్వాస ఆగిపోతే మనిషి చనిపోతారని.. భాష ఆగిపోతే జాతి చనిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Matrubhasha Mahasabha in Vijayawada: జొన్నవిత్తుల ఆధ్వర్యంలో మాతృభాష మహాసభ..
Last Updated : Sep 6, 2023, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details