ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓరి దేవుడా..! కోరికలు ఇలా కూడా తీర్చుకుంటారా..!! - Adilabad Latest News

Buy bike with rupee coins: చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనే తన కలను వెరైటీగా తీర్చుకున్నాడు ఆ యువకుడు.. స్పోర్ట్స్ బైక్​ కొనాలనే తన కోరికను కొద్దిగా వినూత్నంగా ఆలోచించి షోరూం వాళ్లకు పెద్ద పనే చెప్పాడు. మొత్తం రూ.2 లక్షల 85 వేల రూపాయలు చేసే కేటీఎమ్​ బైక్​ అన్ని రూపాయి నాణేలే తీసుకెళ్లి షోరూం నిర్వాహకులను ఆశ్చర్యపరిచాడు.

ఓరి దేవుడా..! కోరికలు ఇలా కూడా తీర్చుకుంటారా..!!
ఓరి దేవుడా..! కోరికలు ఇలా కూడా తీర్చుకుంటారా..!!

By

Published : Dec 9, 2022, 10:48 AM IST

ఓరి దేవుడా..! కోరికలు ఇలా కూడా తీర్చుకుంటారా..!!

Buy bike with rupee coins: 'స్పోర్ట్స్ బైక్ ఆ యువకుడి డ్రీమ్. కానీ అందరిలా కొనుగోలు చేస్తే ఏం వెరైటీ ఉంటుందనుకున్నాడేమో.. కొత్తగా ట్రై చేద్దామని.. తనకు కావల్సిన బైక్ ధర తెలుసుకొని అంత మొత్తం నాణేలతో షోరూం వెళ్లాడు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన వెంకటేశ్ ఆన్​లైన్​లో ఓ గేమింగ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బులను చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు.

చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడే స్పోర్ట్స్​ బైక్ కొనాలని షోరూంకి వెళ్లాడు. తన ఇష్టమైన బైక్​, కలర్​ చూశాడు.. షోరూం నిర్వాహకులతో బేరం ఆడాడు. వారు రూ. 2లక్షల 85 వేలు రూపాయలు చేప్పారు. చివరికు బేరం కుదిరింది. అప్పుడు మన వాడు రంగంలోకి దిగి డబ్బులు ఇవ్వడానికి ట్రాలీతో షోరూంకు వచ్చాడు. అందులో ఉన్న 112 పాలిథీన్​ కవర్లతో డబ్బులు తీశాడు. అందరు ఆశ్చర్యపోయారు. ఆ కవర్లో ఉన్న డబ్బులు అన్ని కేవలం రూపాయి నాణేలు మాత్రమే.. ఇంకేముంది పాపం షోరూం నిర్వాహకులు వాటిని లెక్కపెట్టేసరికి ఒక రోజు పట్టింది. మనోడు బైక్​ మాట పక్కనే పెడితే షోరూం వాళ్లకు మాత్రం పెద్ద పనే చెప్పాడు.

"నాపేరు వెంకటేశ్, మాది మంచిర్యాల నాకు చిన్నప్పటి నుంచి కేటీఎమ్ బైక్​ అంటే చాలా ఇష్టం. అందుకనే ఆన్​లైన్​ గేమింగ్​ యాప్ నిర్వహించి డబ్బులు సంపాదించా.. అందరిలా కాకుండా కొద్దిగా వెరైటీగా కొనాలని ట్రై చేశా.. అందుకనే ఎంతో కష్టపడి రూపాయి నాణేలు పోగుచేసి ఈ బైక్​ కొనుగోలు చేశా".- వెంకటేశ్​, మంచిర్యాల ​ ​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details