ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ విచారణ.. సీట్ల కేటాయింపుపై ఆరా - IT case against Mallareddy

IT investigation on Mallareddy properties: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు.. ఆయన విద్యాసంస్థల సిబ్బంది విచారణ తొలి రోజు ముగిసింది. సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి చేరుకున్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి.. వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి లను విచారించారు. లక్ష్మారెడ్డి వెంటనే వెళ్లిపోగా మిగిలిన వారిని 6 గంటలపాటు విచారించారు. వీరితో పాటు మల్లారెడ్డి బంధువైన నర్సింహారెడ్డి, అతని కుమారుడు త్రిశూల్ రెడ్డిలను సైతం ప్రశ్నించారు. సోదాల్లో భాగంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న దస్త్రాలు, నగదు, హార్డ్ డిస్క్‌లకు సంబంధించి విచారణ కొనసాగింది.

మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ విచారణ..
మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ విచారణ..

By

Published : Nov 29, 2022, 9:42 AM IST

IT investigation on Mallareddy properties: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బంధువులు సోమవారం ఆదాయ పన్ను అధికారుల ఎదుట హాజరయ్యారు. మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఆదాయపన్నుశాఖ అధికారులు మూడురోజులపాటు సోదాలు నిర్వహించిన విషయం విదితమే. దీనికి సంబంధించి అధికారులు శుక్రవారం కొందరికి నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతలో వారు బషీర్‌బాగ్‌లోని ఆదాయపన్నుశాఖ కార్యాలయానికి హాజరయ్యారు.

అయితే మంత్రి మల్లారెడ్డి, మరో కుమారుడు మహేందర్‌రెడ్డిలు మాత్రం విచారణకు హాజరుకాలేదు. సోమవారం జరిగిన విచారణ ఆధారంగా మరో పదిమందికి నోటీసులు జారీ చేశారు. సోదాల సందర్భంగా పెద్ద సంఖ్యలో పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ విచారణ మరికొన్ని రోజులపాటు జరిగే అవకాశం ఉంది.

యాభైకి పైగా వ్యాపారాలు:మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి దాదాపు 50కి పైగా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వీటిలో విద్యాసంస్థలే ప్రధానమైనవి. వీటన్నింటిలో కలిపి ఏటా రూ.వందలకోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. డొనేషన్ల రూపంలో అనధికారికంగా పెద్దమొత్తంలో వసూలు చేసి పన్ను ఎగ్గొట్టి ఉంటారనేది ఐటీ అధికారుల అనుమానం. దాంతోపాటు ఆయా సంస్థల మధ్య నిధుల మళ్లింపు కూడా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

వీటిని నివృత్తి చేసుకునేందుకు సోదాలు జరిపారు. వ్యాపార సంస్థల పనితీరు, ఆదాయ వ్యయాల వంటి వివరాలను ఆరా తీసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు లక్ష్మణ్‌రెడ్డి, సోదరులు నరసింహారెడ్డి, గోపాల్‌రెడ్డితో పాటు త్రిశూల్‌రెడ్డి, మరికొందరు హాజరయ్యారు.

వీరిలో భద్రారెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు విచారించారు. మిగతా వారిని భోజనవిరామం తర్వాత పంపించారు. వారి వారి హోదాలను బట్టి అధికారులు ప్రశ్నలు అడిగారు. ప్రధానంగా ఇంజినీరింగ్‌, వైద్య విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు, యాజమాన్య కోటాలో సీట్ల కేటాయింపు, వాటికి జరిగే చెల్లింపుల వంటివాటికి సంబంధించి సోదాలకు ముందే అధికారులు కొంత సమాచారం సేకరించి పెట్టుకున్నారు. ఈ అంశం గురించే ఎక్కువగా ప్రశ్నలడిగారు. ఎంత ఆదాయానికి పన్నుకట్టారు? వంటి వివరాలను కూడా అధికారులు వీరిని అడిగినట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల అకౌంటెంట్లను కూడా విచారించారు.

"అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పా. నాతోపాటు సిబ్బందినీ విచారించారు. మా అందరి వాంగ్మూలాలు నమోదు చేశారు. అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారు. ఇంజినీరింగ్‌, వైద్య విద్య కళాశాలల ఫీజుల వివరాలు, సీట్ల కేటాయింపుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వారిచ్చిన నమూనాలోనే ఈ వివరాలు ఉండాలన్నారు. వీటన్నింటినీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా సమాధానాలకు అధికారులు సంతృప్తి చెంది ఉంటారని భావిస్తున్నాం.మా కుటుంబ సభ్యులు మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డిలకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పారు". -భద్రారెడ్డి

"ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపులపై ప్రశ్నించారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల్లో ఉన్న వివరాలను విచారించారు. అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు".- మర్రి రాజశేఖర్‌రెడ్డి

"డబ్బులు, ఆర్థిక లావాదేవీల గురించి నన్ను ప్రశ్నలు అడగలేదు. నేను ఎం.ఎల్‌.ఆర్‌.ఐ.టి. కళాశాల ఛైర్మన్‌గా ఉన్నా. ఆర్థిక లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదు. కళాశాలలో విద్యార్థుల ఫిట్‌నెస్‌, క్రీడల వ్యవహారాలు మాత్రమే చూసుకుంటా. అదే విషయాన్ని అధికారులకు చెప్పా".- లక్ష్మణ్‌రెడ్డి

ఇవీ చదవండి:

కొలీజియం సిఫార్సులు వెనక్కి.. 20 దస్త్రాలను తిప్పి పంపిన కేంద్రం!

'బలవంతంగా మతం మార్చడం మతస్వేచ్ఛ కాదు'

హాట్​ హాట్​గా మలైక కేథరిన్​ ఓ లుక్కేయండి

ABOUT THE AUTHOR

...view details