WEATHER UPDATES FROM AP : ఉత్తర అండమాన్-ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈనెల 23నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశముందన్న వాతావరణ విభాగం.. తర్వాత ఒడిశా, పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్ తీరాలవైపు వెళ్తుందని ఐఎండీ భావిస్తోంది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈనెల 24నాటికి చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు
AP WEATHER UPDATES : ఉత్తర అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఎల్లుండికి బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 24 నాటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
AP WEATHER UPDATES