ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్లు సడలించాలి.. లోకేశ్ లేఖ - police recruitment news

Lokesh Letter to Police Recruitment Board: పోలీసు శాఖలో రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారని... గరిష్ఠ వమో పరిమితి నిబంధనతో ఎంతోమంది అనర్హులుగా మారిపోయారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయో పరిమితి ఐదేళ్లు సడలించాలని ఏపీ పోలీసు నియామకాలు బోర్డు చైర్​పర్సన్​కు ఆయన లేఖ రాశారు.

Nara Lokesh
నారాలోకేశ్

By

Published : Dec 12, 2022, 7:21 PM IST

Updated : Dec 12, 2022, 7:53 PM IST

Lokesh Letter to Police Recruitment Board : పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితి ఐదేళ్లు సడలించాలని ఏపీ పోలీస్ నియామకాల బోర్డు చైర్​పర్సన్​కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఎట్టకేలకు వైసీపీ సర్కారు పోలీస్ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలతో చాలా మందికి అందని ద్రాక్షలా మారిందని లోకేశ్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరి నోటిఫికేషన్ విడుదలైందని గుర్తు చేశారు.

ప్రతీ ఏటా పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు.. మూడున్నరేళ్ల తర్వాత పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత పోలీసు శాఖలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఉద్యోగార్థులు సంతోషపడ్డారని,.. అయితే వారి ఆనందం గరిష్ట వయో పరిమితి నిబంధనతో ఆవిరైందని మండిపడ్డారు. నిబంధన వలన ఎంతోమంది అనర్హులుగా మారిపోయారని లేఖలో పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితి కనీసం ఐదు సంవత్సరాలు సడలించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పోలీస్ శాఖ ఉద్యోగాలకు 5 సంవత్సరాల గరిష్ఠ వయో పరిమితి సడలింపును ఇచ్చిన విషయం పరిగణనలోకి తీసుకుని.. రాష్ట్రంలో కూడా వయోపరిమితి సడలింపు ఇవ్వాలని లేఖలో తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details