Lokesh Comments on Jagan: ప్రపంచ ప్రసిద్ధ నియంతలు హిట్లర్, కిమ్, జగన్, బెనిటోలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కోడికత్తి గాటు, బాబాయ్ గుండెపోటు డ్రామాల అనుభవంతో జగన్మోహన్ రెడ్డి తొక్కిసలాట స్కెచ్ వేశాడని ధ్వజమెత్తారు. వెనువెంటనే చీకటి పనుల్లో ఆరితేరిన ఏ1 రెడ్డి చీకటి జీవో నెంబర్ 1 తెచ్చాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నుకున్న ప్రజలంటే భయమనీ ప్రశ్నించే ప్రతిపక్షం అంటే వణుకని విమర్శించారు. సైకో పాలన పోవాలని ఉద్యమిస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజా మద్దతు వెల్లువెత్తుతోందన్న లోకేశ్ చంద్రబాబు సభలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రభంజనం చూసి సైకో ఓర్వలేక ఏపీలో ఎమర్జెన్సీని తలపించే దుస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన నియంత పాలనకి చరమగీతం పాడేందుకు జనం సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
జగన్కు ప్రజలంటే భయం.. ప్రతిపక్షం అంటే వణుకు: లోకేశ్ - జిఓ నెంబర్ 1పై జగన్ పై లోకేష్ వ్యాఖ్యలు
Lokesh Comments on Jagan: ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ ప్రసిద్ధ నియంతలలో ఒకడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సీఎం గత అనుభవాలతోనే తొక్కిసలాట స్కెచ్ వేశాడని ధ్వజమెత్తారు. వెనువెంటనే చీకటి పనుల్లో ఆరితేరిన ఏ1 రెడ్డి చీకటి జీవో నెంబర్ 1 తెచ్చాడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నుకున్న ప్రజలంటే భయమనీ.. ప్రశ్నించే ప్రతిపక్షం అంటే వణుకని విమర్శించారు.
లోకేశ్