Locals protest against the relocation of the Mandal Center: ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు మండల కేంద్రాన్ని వీరులపాడు నుంచి జుజ్జురుకు తరలించనున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మండల కేంద్రమైన వీరులపాడులో గ్రామ పెద్దలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం తరలిపోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు స్థానికంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను చించి కాల్చివేశారు. మొండితోక జగన్మోహన్రావు అరుణ్ కుమారుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మండల కేంద్రం తరలింపుకు వ్యతిరేకంగా రేపు బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
వీరులపాడు మండల కేంద్రం తరలింపుపై నిరసనలు.. రేపు బంద్‌కు పిలుపు - Andhra Pradesh News
Locals Protest against the relocation of the Mandal Center: ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తున్నారన్న ప్రచారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం తరలిపోకుండా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి మండల కేంద్రం తరలింపునకు నిరసనగా రేపు బంద్‌కు పిలుపునిచ్చారు.
మండల కేంద్రం తరలింపుపై స్థానికంగా నిరసనలు