ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్​ విద్యార్థిని చితకబాదిన లెక్చరర్​... అంతటితో ఆగకుండా.. - ఎస్ఏఫ్ఐ

Lecturer beaten student: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే ఒక్కొక్కసారి దారి తప్పుతుంటారు. విజయవాడలోని ఓ కాలేజిలో లెక్చరర్​ ఇంటర్​ విద్యార్థిని చితకబాదాడు. అంతటితో ఆగకుండా కాలితో తన్నాడు. ఈ దృశ్యాలను తోటి విద్యార్థులు రికార్డ్​ చేసి... సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. లెక్చరర్​ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Lecturer beaten student
విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టిన అధ్యాపకుడు

By

Published : Sep 16, 2022, 10:33 PM IST

Lecturer Beaten Student In Vijayawada: విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్​ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వీడియో దృశ్యాలు హల్​చల్​ చేస్తున్నాయి. ఓ కాలేజిలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై.. తరగతి గదిలోనే అధ్యాపకుడు చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో కాలుతో విద్యార్థిని తన్నాడు. ఈ ఘటనను వెనుక వైపు కూర్చున్న విద్యార్థులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఘటనపై ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎస్ఏఫ్ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇంటర్​ విద్యార్థిని చితకబాదిన లెక్చరర్

ABOUT THE AUTHOR

...view details