Leaders Eye on Vijayawada Lorry Stand Site: విజయవాడ భవానీపురంలో.. నగరపాలక సంస్థకు చెందిన 3 ఎకరాల విస్తీర్ణంలో లారీ స్టాండ్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం విలువ రూ.150 కోట్ల పైమాటే. 30 ఏళ్ల క్రితం భారీ వాహనాలు, లారీలు నగరంలోకి నేరుగా రాకుండా.. ఈ స్థలాన్ని లారీ స్టాండుగా అభివృద్ధి చేశారు. అనంతర కాలంలో నగర జనాభా, ట్రాఫిక్ పెరగడంతో.. లారీలు, భారీ వాహనాలు ఊరి వెలుపలే పార్కింగ్‌కు వీలుగా.. 2005-08 ప్రాంతంలో ఇబ్రహీంపట్నం సమీపంలో ఏడెకరాల విస్తీర్ణంలో.. ట్రక్ టర్మినల్ నిర్మించారు. అదే ప్రాంగణంలో ట్రాన్స్‌పోర్టు, బ్రోకరేజ్ వ్యాపారుల కార్యాలయాలు నిర్మించారు.
హాకర్స్, ఆటో స్టాండ్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
Workers Protest on Vijayawada Lorry Stand Relocation: కానీ.. ఆ ట్రక్ టెర్మినల్‌లో లారీ పార్కింగ్‌కు వాహన యజమానులు నిరాకరించారు. కానీ.. పోలీసుల సాయంతో కొన్నాళ్లపాటు అక్కడే లారీలు పార్కింగ్ చేయించారు. ఆ సమయంలో భవానీపురం లారీ స్టాండ్‌ను మూసేసి సదరు స్థలంలో మళ్లీ ప్లెక్సులు, షాపింగ్ మాల్స్ ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు. ఆ ప్రక్రియ అంతకుమించి అప్పట్లో ముందుకు కదల్లేదు. 2008-10 మధ్యకాలంలో.. భవానీపురంలో లారీ పార్కింగు కోసం యజమానులు మళ్లీ అనుమతులు పొందారు. కానీ.. 2019కి ముందు.. గొల్లపూడి వై జంక్షన్ నుంచి చనుమోలు వెంకట్రావు బ్రిడ్జి వరకు ఇన్నర్ రోడ్డు అభివృద్ధి చేయడం, కనకదుర్గ పైవంతెన నిర్మించడంతో.. భవానీపురం లారీ స్టాండుకు వచ్చే వాహనాల సంఖ్య తగ్గింది.
విశాఖ పోర్టులో విశాలమైన లారీ స్టాండ్
Protest on Vijayawada Lorry Stand Site Privatize: ఇదే అదునుగా.. ఖాళీగా కన్పిస్తున్న స్థలంపై.. కొందరు పెద్దల కన్ను పడింది. ఓ శాసనసభ్యుడు, కార్పోరేషన్లోని మరో ముఖ్య ప్రజాప్రతినిధి ఆలోచనలతో ఇక్కడి ట్రాన్సుఫోర్టు, టైర్ రీట్రేడింగ్, కమిషన్ ఏజెంట్లు, బ్రోకర్ల కార్యాలయాలను భవానీపురంలోని నగరపాలక సంస్థకు చెందిన ఐరన్ యార్డు స్థలంలోకి తరలించేందుకు ఎత్తుగడ వేశారు. ఐరన్ యార్డు స్థలంలో 36 షెడ్ల నిర్మాణానికి మేయర్ ముందస్తు అనుమతి కూడా ఇచ్చేశారు. లారీ స్టాండ్ ప్రాంగణంలో గతంలో ఓ రక్షితనీటి పథకం ఉండగా.. ప్రస్తుతం మరొకటి నిర్మిస్తున్నారు.
Protest on Vijayawada Lorry Stand Relocation: ప్రస్తుత లారీ స్టాండ్ స్థలాన్ని దీర్ఘకాలిక లీజు పేరిట దక్కించుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు.. తమకు అనుకూల వ్యక్తులు, సంస్థలకు లీజుకిచ్చే ఆలోచనల్లో.. ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని తెలుగుదేశం కౌన్సిలర్ నెలిబండ్ల బాలస్వామి.. గత కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించగా.. మేయర్ స్పష్టత ఇవ్వలేదు. లారీ స్టాండ్ తరలింపు వార్తలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్యకలాపాలకు అనువుగాని చోటకు లారీస్టాండ్‌ను.. తరలిస్తామంటే ఒప్పుకోబోమని.. కార్మికులు తేల్చిచెప్తున్నారు. సమస్యను.. ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. ఎంతో మంది ఉపాధికి ఆధారమైనా లారీస్టాండ్ స్థలాన్ని.. ప్రైవేటుకు ధారాదత్తం చేసే యోచన విరమించుకోవాలని.. లారీ యజమానులు, కార్మికులు కోరుతున్నారు.
కేరళ ఆటోల్లో పోస్టల్ శాఖ డిజిటల్ చెల్లింపులు