LAWYERS PROTEST: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ నిలిపివేయాలని కోరుతూ న్యాయవాదులు హైకోర్టు ముందు తమ నిరసన తెలిపారు. న్యాయమూర్తుల బదిలీపై కొలీజియం పునరాలోచించాలని కోరారు. భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. న్యాయమూర్తుల బదిలీపై ఇప్పటికే న్యాయవాదుల జేఏసి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖమంత్రులను కూడా కలిసి వినతిపత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, డి.రమేష్ బదిలీలను నిలిపేవరకు తమ నిరసనను వివిధ రూపాల్లో కొనసాగిస్తామని అన్నారు.
న్యాయమూర్తుల బదిలీ నిలిపివేయాలంటూ న్యాయవాదుల నిరసన - హైకోర్టు ముందు న్యాయవాదుల నిరసన
LAWYERS PROTEST: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ నిలిపివేయాలని కోరుతూ న్యాయవాదులు హైకోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల బదిలీపై కొలీజియం పునరాలోచించాలని కోరారు. రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖమంత్రులను కూడా కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.
![న్యాయమూర్తుల బదిలీ నిలిపివేయాలంటూ న్యాయవాదుల నిరసన lawyers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17149891-645-17149891-1670500577199.jpg)
న్యాయవాదుల నిరసన