Counter On CID Notices: మార్గదర్శి ఆడిటర్ అరెస్ట్‌పై రౌండ్ సమావేశంలో అభిప్రాయాలను వ్యక్తం చేసిన న్యాయవాదులకు సీఐడీ నోటిసులివ్వటం.. వారి పరిధి దాటినట్లేనని న్యాయవాదులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందని నిపుణులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారికి 160 సీఆర్పీసీ నోటీసులివ్వకూడదని నిబంధనను కూడా సీఐడి పోలీసులు ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. అభిప్రాయం వ్యక్తం చేస్తే ..మీదగ్గరున్న ఆధారాలు తీసుకురావాలని నోటీసులివ్వటం సరికాదన్నారు. రాజ్యాంగ హక్కులను సీఐడీ అధికారులు ఉల్లంఘించరాని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. నోటీసులివ్వటం వెనుక ఉన్న కోణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వానికి అనుకులంగా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు అనిపిస్తోందని న్యాయవాదులు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి సెక్షన్ 160 కింద నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. సీఐడీ భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకే ఇలాంటి చర్యలు చేపడుతుందని న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు సీఐడీ అధికారులు నోటీసులు ఇస్తునారంటూ మండిపడ్డారు. సీఐడీ అధికారుల చట్టాలను దృష్టిలో పెట్టుకోని పనిచేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. నోటీసుల పేరుతో చట్టాలను ఎలా దుర్వినియోగం చేస్తన్నారో అనే అంశంపై జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని పలువురు న్యాయవాదులు అభిప్రాయ పడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కెందుకే నోటీసులిచ్చారని పలువురు న్యాయవాదులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు . సీఐడీ నోటీసులకు నిరసనగా వివిధ కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నారు.