ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lack of Facilities in Library: గుంటూరు ప్రభుత్వ లైబ్రరీ కిటకిట.. వసతులకు కటకట..! - గుంటూరు లైబ్రరీలో వసతులు న్యూస్

Lack of Facilities in Library: పదిమందికి విజ్ఞానాన్ని పంచిపెట్టే గుంటూరులోని ప్రాచీన పుస్తక భాండాగారం.. మౌలిక సమస్యల లేమితో కొట్టుమిట్టాడుతోంది. శిథిలావస్థకు చేరిన భవనాలు.. పెచ్చులూడుతున్న పైకప్పు.. వర్షం పడితే చాలు గోడలకు చెమ్మతో పుస్తకాలు కాపాడుకోలేని దుస్థితి. ఇదీ పేరెన్నికగన్న గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పరిస్థితి. ప్రభుత్వం స్పందిస్తే తప్ప కోలుకోలేని పరిస్థితిలో.. ఈ గ్రంథాలయం సమస్యలతో ఎదురీదుతోంది.

Lack of Facilities in Library
గుంటూరు ప్రభుత్వ లైబ్రరీలో వసతుల కొరత

By

Published : Jun 15, 2023, 10:03 AM IST

Lack of Facilities in Library: ఇది గుంటూరులోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం. 1915లో నిర్మించిన ఈ భవనంలో 1954లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ పుస్తక భాండాగారంలో ప్రస్తుతం లక్షా 47వేల పుస్తకాలున్నాయి. ఈ గ్రంథాలయానికి రోజుకు 250 మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగార్థులు వస్తుంటారు. ప్రాచీన గ్రంథాలయం కావటంతో ఇక్కడ కొన్ని వేలమంది చదువుకుని వివిధ ఉద్యోగాలు సాధించారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులతో గ్రంథాలయం రద్దీగా ఉంటుంది. డబ్బులు చెల్లించి ప్రైవేటు రీడింగ్ రూములకు వెళ్లలేని పేద, మధ్యతరగతి యువకులకు ఈ గ్రంథాలయం అందుబాటులో ఉంటుంది.

AP HRC updates: ఏపీ హెచ్‌ఆర్‌సీలో సిబ్బంది కొరత.. తుది ఉత్తర్వులు ఆలస్యం

సుమారు 70 ఏళ్ల నుంచి పేరొందిన గ్రంథాలయం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. చాలాచోట్ల పైకప్పు పెచ్చులు ఊడి అప్పుడప్పుడూ విద్యార్థులపై పడుతున్నాయి. ఇక వర్షమొచ్చిందంటే గోడలు చెమ్మపడుతున్నాయి. గ్రంథాలయంలో పుస్తకాలు చెద పట్టకుండా నిర్వాహకులు రసాయనాలను స్ప్రే చేస్తున్నారు.నానాటికి పోటీ పరీక్షల పుస్తకాలు కొరత ఏర్పడుతుందని ఉద్యోగార్థులు చెబుతున్నారు. మగ విద్యార్థులకు మరుగుదొడ్ల సదుపాయం కరవైంది. ప్రభుత్వ గ్రంథాలయం కావటంతో ఎలాంటి సెస్సులు విడుదల కావు. దాతలు ఇచ్చే విరాళాలు తప్ప నిర్వహణ నిధులు రావడం లేదు. గ్రంథాలయం పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారటంతో ప్రభుత్వమే స్పందించి గ్రంథాలయం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని విద్యార్థులు, ఉద్యోగార్థులు కోరుతున్నారు.

నిధుల కొరత.. పని చేయని ఉర్దూ కంప్యూటర్​ శిక్షణ కేంద్రాలు

లైబ్రెరీలో నెలకొన్న సమస్యలపై.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని గ్రంథాలయ అధికారి ఎన్‌. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే గ్రంథాలయంలో నవీకరణ పనులు చేపడతామన్నారు. వేలాదిమందికి విజ్ఞాన జ్యోతులు పంచుతున్న ఈ గ్రంథాలయం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యార్థులు, ఉద్యోగార్థులు కోరుతున్నారు.

"డబ్బులు చెల్లించి ప్రైవేటు రీడింగ్ రూమ్​లకు వెళ్లలేని పేద, మధ్యతరగతివారు ఈ గ్రంథాలయానికి చదువుకునేందుకు వస్తుంటారు. అయితే ఈ గ్రంథాలయం పైకప్పు పెచ్చులు ఊడి మాపై పడుతున్నాయి. ఇటీవలే రెండుమూడు సార్లు ఇలా పై నుంచి పెచ్చులు పడ్డాయి. వర్షాకాలంలో గోడలు చెమ్మపడుతున్నాయి. పురుషులకు అయితే వాష్​రూం సదుపాయం కూడా లేదు. ఫ్యాన్స్, లైట్లు కూడా సరిగా లేవు. ఇక్కడి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతోపాటు ఈ లైబ్రరిలో కాంపిటేటివ్ అప్డ్​డేట్ బుక్స్ కూడా సరిగా లేవు. దయచేసి దీనిపై ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించి.. ఈ లైబ్రరీలో కనీస సౌకర్యాలను కల్పించాలని కోరుకుంటున్నాము." - రవీంద్ర, గుంటూరు

GUNNY BAGS: రైతులను వేధిస్తున్న గోనె సంచుల కొరత.. పట్టించుకోని అధికారులు

"1915లో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవటం వల్ల పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి. గ్రంథాలయంలో పుస్తకాలు చెద పట్టకుండా ప్రతిరోజు సిబ్బంది క్లీన్ చేస్తోంది. లైబ్రెరీలో నెలకొన్న సమస్యలపై.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే గ్రంథాలయంలో నవీకరణ పనులు చేపడతాము." - ఎన్. వెంకటేశ్వరరావు, గ్రంథాలయ అధికారి

ABOUT THE AUTHOR

...view details