Kondapalli Nagarjuna School Old Students Meet: విద్యాలయాలు విజ్ఞానంతో పాటు అనేక మంది ప్రాణ స్నేహితులనూ ఇస్తుంది. చదువుకునే రోజుల్లో అనేక చిలిపి పనులను, మధురజ్ఞాపకాలను మిగులుస్తాయి. అదే చిన్నప్పుడు కలసి చదువుకున్న స్నేహితులందరూ ఓ ఇరవై, ముప్పై ఏళ్ల తరువాత ఒకే చోట కలుసుకుంటే ఆ ఆనందాన్ని వెలకట్టలేము. ఆ వేదిక విద్యార్థులు చదువుకునే పాఠశాలే అయితే అబ్బో ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటి మధుర జ్ఞాపకాలకు వేదికయ్యింది విజయవాడ సమీపంలోని కొండపల్లిలోని నాగార్జున విద్యాలయం.
విజయవాడ సమీపంలోని కొండపల్లిలో నాగార్జున విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో 1979లో దేవినేని కిశోర్ కుమార్, జోనీ కుమారి దంపతులు నాగార్జున విద్యాసంస్థలను నెలకొల్పారు. కొన్ని వేల మంది ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు వ్యాపారులుగా, రాజకీయ నాయకులుగా, ఉపాధ్యాయులుగా, ఐటీ నిపుణులుగా వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు.
అలాంటి వారంతా చదువుకున్న పాఠశాలనే చదువుకున్న రోజుల్లోని జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు. వారి సంతోషాలు, ఇష్టాలు, నాటి చిలిపిపనులు, అన్నీ నెమరు వేసుకున్నారు. నవ్వుకున్నారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఒకరికి ఒకరు పంచుకున్నారు. చదువుచెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయులతో దెబ్బలు కాసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. ఇలా అనేక మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.
ఏయూలో పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం - ముఖ్య అతిథిగా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్