ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'' వైసీపీకి బీసీలు అంటే ఓటు బ్యాంక్ మాత్రమే..బ్యాక్ బోన్ కాదు'' - ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేసిన రవీంద్ర

Allegations on Chief Minister: వైసీపీ ప్రభుత్వానికి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే గాని బ్యాక్ బోన్ కాదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులు నిల్చోని మాట్లాడటం యావత్ బీసీలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BCs were insulted
బీసీలను అవమానించారు

By

Published : Dec 10, 2022, 5:09 PM IST

Allegations on Chief Minister : బీసీలను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా జగన్​మోహన్​రెడ్డి అవమానించారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే గాని బ్యాక్ బోన్ కాదని స్పష్టం చేశారు. బీసీలకు పెద్ద పీట వేయడమంటే నిల్చోపెట్టి అవమానించడమేనా అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులను నిల్చోబెట్టి మాట్లాడటం యావత్ బీసీలను అవమానించడమేనని అన్నారు. బడుగు బలహీన మంత్రుల అధికారాలను లాక్కొని సామంతరాజులకు ముఖ్యమంత్రి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల దమ్మేంటో త్వరలోనే చూపిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details