ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంగవీటి రాధాతో అనుబంధం పార్టీలకు అతీతం: కొడాలి నాని - వంగవీటి రంగా వర్ధంతి

Kodali Nani on Vangaveeti: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా చావుకు కారణమైన వారు నేడు దండలు వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. రంగా ఆశయాలను సాధించడానికి మా చివరి రక్తపు బొట్టు వరకు ఆర్పిస్తామని స్పష్టం చేశారు.

Kodali Nani
కొడాలి నాని

By

Published : Dec 26, 2022, 9:23 PM IST

Kodali Nani on Vangaveeti: గుడివాడలో ఎవరిపై దాడి జరిగిందో అందరికి తెలుసన్న కొడాలి నాని.. రావి కుటుంబం, ఆయన ఆస్తులను రంగా అభిమానులు ధ్వంసం చేశారన్నారు. రంగాను చంపినవారు కూడా నేడు ఆయనకు దండలు వేసే పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. వంగవీటి రాధాకృష్ణ మా కుటుంబం సభ్యుడు.. మేము ఆయన కుటుంబ సభ్యులమన్నారు. నిన్న గుడివాడలో జరిగింది కామెడీ ఎపిసోడ్ మాత్రమేనన్నారు. గుడివాడలో రోజుకొక వ్యక్తిని తీసుకువచ్చి కొడాలి నాని పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. మమ్ములను నమ్మితే మళ్ళీ అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా చెబుతున్నారని అన్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని

నిన్న గుడివాడలో జరిగింది ఒక కామెడీ ఎపిసోడ్. ఎవడైనా ఫోన్ చేసి.. నిన్ను చంపేస్తా ఉండమని చెప్తారా.. నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి.. శాసనసభ్యుడని అయిన దగ్గర నుంచి ఆయన ఫొటో పెట్టుకొని.. ఆయన కుటుంబ సభ్యులతో తిరిగిన వ్యక్తిని నేను. ఇవాళ వాళ్లు ఓన్ చేస్కోవడం ఏంటి..? కొత్తగా మేము ఓన్ చేసుకునేదేెంటి.. రంగా గారు మా సొంతం. రాధాబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు.. నేను తెలుగు దేశం పార్టీలో ఉండేవాన్ని.. ఈ రోజు అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు.. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న. మా ప్రయాణం పార్టీలకు అతీతం రాధాబాబు కూడా అదే చెప్తున్నాడు. - కొడాలి నాని, మాజీ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details