Kidney Diseases Killing Tribals : ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధులు గిరిజనుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. గిరిజన గూడేలు కిడ్నీ వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో బాధితులు మరణించగా... వందల సంఖ్యలో రోగులు కిడ్నీ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. కిడ్నీవ్యాధులకు ప్రధాన కారణం తాగునీరేనని గుర్తించినప్పటికీ... స్వచ్ఛ జలాలు అందించడంలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కాగా... నేతల హామీలు కార్యరూపం దాల్చడం లేదు.
Kidney Diseases Killing Tribals : పాలకుల పాపం.. గిరిజనులకు శాపం..! స్వచ్ఛమైన తాగునీరందక పెరుగుతున్న కిడ్నీ జబ్బులు Women Protest for Water on Road at Podili: పొదిలిని వేధిస్తున్న నీటి కష్టాలు..మరోసారి రోడ్డెక్కిన మహిళలు
స్వచ్ఛమైన తాగునీరందక ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని 22 గిరిజన తండాల్లో వందల మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. మూడేళ్లలో 200 మందికి పైగా గిరిజనులు మృత్యువాత పడ్డారు. వందలమంది కిడ్నీ వ్యాధులతో ఎదురీదుతున్నారు. నడుంనొప్పి, వెన్నునొప్పి, విపరీతమైన అలసట లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటే కిడ్నీ వ్యాధులని నిర్ధారణ అవుతున్నాయి. తీవ్రత తక్కువ ఉన్నవారు మందులు వాడుతుండగా... తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఎం.కొండూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ కూడా అరకొర మందులు అందిస్తున్నారు. కొన్ని మందులతో పాటు ఐరన్ ఇంజక్షన్లు ఇవ్వడం లేదు. విజయవాడ వెళదామంటే వేలల్లో ఖర్చవుతుంది. తమ బాధను తమలో దిగమింగుకుని గిరిజనులు పుట్టెడు కష్టంతో బతుకీడిస్తున్నారు. కొందరు పనులకు వెళ్లలేక.. మందులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటిలో ఫ్లోరైడ్, సిలికాన్ మోతాదులు ఎక్కువ ఉండటం వల్లే గిరిజనులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం 17 తండాల్లో ట్యాంకులు ఏర్పాటుచేసి నీటిని తెచ్చి పోస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కిడ్నీ వ్యాధులతో చిక్కి శల్యమౌతున్న గిరిజనులు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారు.
Holes for Drinking Water Pipelines in Sewers: గరళంగా మారుతున్న మంచినీరు..అమృత్ పనులు పూర్తి చేయని వైసీపీ సర్కారు
ఎ.కొండూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని కుదప గ్రామం వద్ద కృష్ణా జలాల సంపు ఉంది. అక్కడి నుంచి పైపులైన్ ద్వారా కిడ్నీ బాధిత గ్రామాలకు స్వచ్ఛమైన జలాలు తీసుకురావాలనేది ప్రతిపాదన. వల్లంపట్ల, చైతన్యనగర్, దీప్లానగర్, చీమలతండాల్లో సంపులను ఏర్పాటుచేసి అక్కడ నుంచి 24 గ్రామాల్లోని వాటర్ షెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేయాలని భావించారు. పైప్ లైను పనులు, ట్యాంకుల నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయవచ్చని గ్రామీణ నీటిసరఫరా అధికారులు అంచనాలు తయారు చేశారు. ప్రస్తుతం నిర్మాణ వ్యయం పెరిగి రూ.49.25 కోట్లకు పెరిగింది. కృష్ణా జలాల శాశ్వత ప్రాజెక్టు ఏర్పాటుచేస్తే ఎ.కొండూరు మండలంలోని 12 గిరిజన గ్రామాలతోపాటు చుట్టుపక్కల ఉన్న 21 పంచాయతీల పరిధిలో 40వేల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రప్రభుత్వం 20 శాతం వాటా నిధులు విడుదల చేస్తే.. జలజీవన్ మిషన్ కింద కేంద్రం 80 శాతం వాటా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇద్దరు కేంద్రమంత్రులు ఇక్కడకొచ్చి మరీ బహిరంగంగానే ప్రకటించారు.
అయినప్పటికీ రాష్ట్రం నుంచి ఈ ప్రాజెక్టు కోసం కనీసం దస్త్రం కూడా చాలాకాలం కేంద్రానికి పంపించలేదు. ఇదే ప్రాజెక్టు కోసం 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను విడుదల చేస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు నెలల కిందట తిరువూరు బహిరంగ సభలో ప్రకటించారు. ప్రకటనే తప్పా తర్వాత దానికి సంబంధించిన కదలికే లేదు. 50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.. కనీసం 20 శాతం వాటాగా 10 కోట్లు చెల్లిస్తే చాలు... వేలమంది గిరిజనులను కిడ్నీ వ్యాధుల బారినపడకుండా కాపాడవచ్చు. జలజీవన్ మిషన్ కింద కృష్ణా జలాల ప్రాజెక్టును ఇప్పటికైనా పట్టాలెక్కించాలని స్థానిక ప్రజా, గిరిజన సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జలాల ప్రాజెక్టుకు జలజీవన్ మిషన్ కింద 49 కోట్లు మంజూరయ్యాయని ఇటీవల ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఇక స్పందించాల్సింది రాష్ట్రప్రభుత్వమే.
State Govt ignore Jaljeevan Mission: తాగునీటికి పైసా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు