Kesineni Chinni Counter to Kesineni Nani: కేశినేని నాని వ్యవహారశైలి, ఇటీవల టీడీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కేశినేని నానిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నాని వైసీపీ కోవర్టు అని ధ్వజమెత్తారు. అయితే ఇదే అంశంపై కేశినేని నాని సోదరుడు చిన్నీ స్పందించారు.
'కేశినేని నాని వైసీపీ కోవర్ట్' - 'చంద్రబాబు, లోకేశ్‌ను విమర్శించే స్థాయి లేదు' తమ కుటుంబ కలహాలు ఎన్నో ఏళ్ల నుంచీ ఉంటే, చంద్రబాబుకి ఏం సంబంధమని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్నీ ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా దశాబ్దాల నుంచీ తానే సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానీకి లేదని అన్నారు.
చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదని హితవు పలికారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశంని వీడినా పార్టీకేం కాలేదని తెలిపారు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారని పేర్కొన్నారు. ఎవరూ కూడా ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీని ఏం చేయలేకపోయారని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
జగన్ కళ్లలో ఆనందం కోసమే కేశినేని నాని రాజకీయాలు: దేవినేని ఉమ
Buddha Venkanna Comments on Kesineni Nani: కేశినేని నాని వైసీపీ కోవర్ట్ అని తేలిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో కేశినేనికి కూడా భాగం ఉందని తేలిపోయిందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీని నాశనం చేయడానికి, వెల్లంపల్లికి అనుకూలంగా పని చెయ్యడానికి కేశినేని నాని సిద్దపడ్డారని ఆరోపించారు.
కేశినేని నాని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కో ఆర్డినేటరుగా కేశినేని నాని నియమించుకున్న రోజే తనకు కేశినేని నాని కోవర్టు అని తెలుసన్న బుద్దావెంకన్న అన్నారు. కానీ చంద్రబాబుపై ఉన్న గౌరవంతో ఏం మాట్లాడకుండా ఉన్నానన్నారు. ఈ రోజు ప్రజలకి, తెలుగుదేశం సైనికులకి సైతం తెలిసిందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
Nettem Raghuram Fires on Nani: కేశినేని నాని అవకాశవాది, జగన్ అరాచక వాది అని మాజీమంత్రి నెట్టెం రఘురాం దుయ్యబట్టారు. ఓ అవకాశవాది, అరాచక వాది పంచన చేరారని విమర్శించారు. కేశినేని నాని పార్టీని వీడడం వల్ల నష్టమేం లేదని స్పష్టం చేశారు. కేశినేని నాని వెంట ఉన్న సహచరులు, అనుచరులు తెలుగుదేశంలోనే ఉండిపోయారని తెలిపారు. వైసీపీలో జరుగుతున్న గందరగోళాన్ని, సంక్షోభాన్ని చిన్నదిగా చూపడానికి నానీని వైసీపీ ఉపయోగించుకుంటోందని నెట్టెం రఘురాం అన్నారు.
వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైన కేశినేనికి అనుచరుల షాక్
TDP MS Baig About Kesineni: టీడీపీ నేత ఎం.ఎస్ బేగ్ తన అనుచరులతో కలిసి ఉండవల్లిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని కలిశారు. తెలుగుదేశంలోనే తామంతా కొనసాగుతామని బేగ్, అతని అనుచరులు స్పష్టం చేశారు. బేగ్‌ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేని చేస్తానంటూ ఇటీవల కేశినేని నాని ప్రకటించారు. కేశినేని నానితో తామెవ్వరం వెళ్లట్లేదని బేగ్, అతని అనుచరులు లోకేశ్‌కి స్పష్టం చేశారు.
రాజకీయ మనుగడ కోసం చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోం: టీడీపీ నేతలు