ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశ శాంతి, జల, వన సంరక్షణ... 52 ఏళ్ల వయస్సులో సైకిల్ యాత్ర

Cycle Yatra: కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయ గోపాల కృష్ణ 52 సంవత్సరాల వయస్సులో సైకిల్ యాత్రను ప్రారంభించారు. దేశ శాంతి, జల, వన సంరక్షణ నినాదంతో దేశ వ్యాప్తంగా యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం విజయవాడకు చేరుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందామా..!

52Years Old Men Cycle Yatra
52Years Old Men Cycle Yatra

By

Published : Mar 23, 2023, 10:29 PM IST

Updated : Mar 24, 2023, 11:32 AM IST

Cycle Yatra : రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడానికి పాదయాత్రలు చేయడం చూశాం. గత కొంత కాలంగా సామాన్య ప్రజలు సైకిల్ యాత్ర చేస్తూ తన గళాన్ని ప్రజలకు, అధికారులకు తెలియజేస్తున్నారు. గత నెలలో మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి ఆశా మాల్వియా మహిళా సాధికారత, భద్రత నినాదంతో దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్రను చేపట్టింది. మూగ జీవులను చంపొద్దు అంటూ అన్నా చెల్లెళ్లు సైకిల్ యాత్రను ప్రారంభించారు. తాజాగా 52 సంవత్సరాల విజయ గోపాల కృష్ణ దేశ శాంతి, జల, వన సంరక్షణ నినాదంతో దేశ వ్యాప్తంగా యాత్రను చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడకు చేరుకున్నారాయన.

13 రాష్ట్ల్రాలో వివిధ పుణ్య క్షేత్రాలు సందర్శించారు : విజయ గోపాల కృష్ణ సాధారణ రైతు కుటంబానికి చెందిన వ్యక్తి. ఈయన తండ్రి మన రాష్ట్రానికి చెందిన వ్యకి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన వారు. జీవనోపాధి కోసం కర్ణాటక వెళ్లారు. గత సంవత్సరం మార్చి 11 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరు నుంచి దేశ శాంతి, జల, వన సంరక్షణ నినాదంతో దేశ వ్యాప్తంగా యాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచి 13 రాష్ట్ల్రాలో వివిధ పుణ్య క్షేత్రాలు సందర్శించారు. అదే సమయంలో పుణ్య నదులను కూడా సందర్శించానని ఆయన చెప్పారు.

నీటిని పరిశుభ్రంగా ఉంచాలి :ప్రస్తుతం యాత్రలో భాగంగా బుధవారం ఉగాది పండుగ రోజున కనక దుర్గ దర్శనానికి విజయవాడకు చేరుకున్నారు. అమ్మ వారిని దర్శనం చేసుకోని గురువారం అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళుతున్నాని, తన ఉద్దేశ్యం జల, వన సంరక్షణ నీటిని పరిశుభ్రంగా ఉంటే జంతు జన జీవనం బాగుంటుదని, ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకోవాలని కోరారు. అనారోగ్య కారణాల వల్ల తాను పెళ్లి చేసుకోలేదని, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు గోపాల కృష్ణ తెలిపారు. దేవాలయాల వద్దే బస చేస్తుంటానని, ఆక్కడ పూజారులు, భక్తులు పెట్టింది తింటూ సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నానని, ఏపీలోని పలు ప్రాంతాలు తిరిగి ఒడిశా లోని పూరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటానన్నారు. తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకుంటానంటానని గోపాల కృష్ణ చెబుతున్నారు.

నేను దేశ శాంతి, దైవ దర్శనం అంటూ కాశీ రామేశ్వరం సైకిల్ యాత్ర మొదలు పెట్టాను. గత సంవత్సరం మార్చి 11 తేదీన యాత్రను మొదలు పెట్టాను. విజయవాడలోని కనక దుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి నిన్న సాయంత్రం వచ్చాను. అన్నవరంలోని వీర వెంకట సత్య నారాయణ స్వామి దర్శనానికి వెళుతున్నాను. నా ఉద్దేశ్యం జల, వన సంరక్షణ నీటిని పరిశుభ్రంగా ఉంటే జంతు జన జీవనం బాగుంటుదని ప్రతి ఒక్కరు భక్తితో ఉండాలనే ఉద్దేశ్యంతోటి పుణ్య క్షేత్రాలు, పుణ్య నదులు తిరుగుతున్నాను. కర్ణాటక సిందునూరు నుంచి ప్రారంభించాను. ఇప్పటికి 13 రాష్ట్రాలు తిరిగాను. నాకు ఎటువంటి సపోర్టు లేదు. - విజయ గోపాల కృష్ణ,సైకిల్ యాత్రికుడు

52 ఏళ్ల వయస్సులో సైకిల్ యాత్ర

ఇవీ చదవండి

Last Updated : Mar 24, 2023, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details