ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kapu Function Hall Construction Works Delay: కాపు కమ్యూనిటీ హాల్‌పై వైసీపీ సర్కార్​ చిన్నచూపు.. ముందుకు సాగని నిర్మాణ పనులు - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్

Kapu Function Hall Construction Works Delay: విజయవాడలో దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు పేరుతో నిర్మించతలపెట్టిన కాపు కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భవన నిర్మాణ స్థలం అన్యాక్రాంతమవుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని కాపు సంఘం నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే రాజకీయాలకు అతీతంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Kapu_Function_Hall_Construction_Works_Delay
Kapu_Function_Hall_Construction_Works_Delay

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 3:41 PM IST

Kapu Function Hall Construction Works Delay: కాపు కమ్యూనిటీ హాల్‌పై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు

Kapu Function Hall Construction Works Delay:దర్శకరత్న దాసరి నారాయణరావు పేరుతో.. విజయవాడలోని గులాబీ తోటలో నిర్మించ తలపెట్టిన.. కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం అడుగు ముందుకు పడలేదు. శంకుస్థాపన జరిగి ఐదేళ్లు కావొస్తున్నా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు కమ్యూనిటీ భవనాన్ని పూర్తిగా విస్మరించిందని స్థానికులు ఆగ్రహిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ 27వ డివిజన్‌లో కాపు కమ్యూనిటీ భవనానికి 2018లో శంకుస్థాపన జరిగింది. 50లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏళ్లు గడుస్తున్నా కమ్యూనిటీ భవనం పూర్తికాక స్థానికులు అవస్థలు పడుతున్నారు.

Kapu Leaders Agitation in Amaravati: అమరావతిలో కాపు సంఘాల అందోళన.. అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

Dasari Narayana Rao Kapu Function Hall:కాపు కార్పొరేషన్ సైతం కమ్యూనిటీ భవన నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపు కమ్యూనిటీ భవన నిర్మాణ స్థలాన్ని చెత్తా చెదారంతో నింపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు దీనిపై స్పందించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాపు కమ్యూనిటీ భవన నిర్మాణ స్థలం అన్యాక్రాంతమవుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని కాపు సంఘం నేతలు ఆరోపించారు.

Kapu Function Hall in Vijayawada:2019 నుంచి ఒక్క ఇటుక కూడా ఇక్కడ పేర్చలేదని ఆగ్రహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషుకుమార్‌ రాజకీయాలను పక్కన పెట్టి కాపు కమ్యునిటీ భవనాన్ని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కాపు కమ్యూనిటీ భవనానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాజకీయాలకు అతీతంగా ఆందోళనకు దిగుతామని కాపు సంఘం నేతలుహెచ్చరించారు.

ROUND TABLE MEETING: 'కాపు సామాజిక భవనాలను పూర్తి చేయాలి'

"దర్శకరత్న దాసరి నారాయణరావు పేరుతో విజయవాడ 27వ డివిజన్‌లో కాపు కమ్యూనిటీ భవనానికి 2018వ సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. 50లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాపు కార్పొరేషన్ సైతం కమ్యూనిటీ భవన నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తోంది. కాపు కమ్యూనిటీ భవన నిర్మాణ స్థలాన్ని చెత్తా చెదారంతో నింపుతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాము. కాపు కమ్యూనిటీ భవనానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే రాజకీయాలకు అతీతంగా ఆందోళనకు దిగుతాం" - కాపు సంఘం నేతలు

ABOUT THE AUTHOR

...view details